06-10-2025 12:00:00 AM
మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి హాజరు
మేడ్చల్, అక్టోబర్ 5 (విజయ క్రాంతి): మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ మలేషియా పర్యటనలో ఉన్నారు. బ్రిక్ ఫీలడ్స్ లోని ఒక రెస్టారెంట్ లో మలేషియా భారతీయ అసోసియేషన్ వారు నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి హాజరయ్యారు. మలేషియా ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ ప్రకటించిన మైగ్రేంట్ రేపార్టేషన్ ప్రోగ్రాం 2.0, మలేషియాలో భారతీయుల జీవన విధానం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో చేపడుతున్న అనేక అంశాలపై వారితో చర్చించారు. ఈ కార్యక్రమంలో చొప్పరి సత్య, ఉపాధ్యక్షుడు భాను మూత్తినేని, ప్రధాన కార్యదర్శి రవితేజ శ్రీ దశ్యం, కోశాధికారి రుద్రాక్షల సునీల్ తదితరులు పాల్గొన్నారు.