calender_icon.png 29 October, 2025 | 10:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంటలను నీట ముంచిన మొంథా తుఫాన్

29-10-2025 07:42:17 PM

చిట్యాల,(విజయక్రాంతి): మొంథా తుఫాన్ ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణం గా పత్తి, వరి పంటలు నీట మునిగి రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.  చిట్యాల, రామన్నపేట, నార్కట్ పల్లి మండలాలలో తుఫాన్ కారణంగా కురుస్తున్న వర్షానికి కోతకు రావలసిన వరి పంట చేనులోనే నీట మునిగి కన్నీటి పర్యంతం అవుతున్న రైతులు కొందరైతే, పిఎసిఎస్ కేంద్రాలలో వర్షానికి తడిసి ముద్దయిన వరి ధాన్యమును చూసి తల్లడిల్లుతున్న రైతులు మరికొందరు. చేనుపైనే ఉన్న పత్తి తడిసి ముద్దయి తీవ్ర నష్టాన్ని కలిగించగా  అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టిన పత్తి రైతులకు కన్నీరే మిగిలింది. తడిసిన వరి ధాన్యాన్ని, పత్తిని ప్రభుత్వమే కొనుగోలు చేసి అన్నదాతలకు అండగా ఉండి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.