08-07-2025 01:21:51 AM
తూప్రాన్, జులై 7:దళిత వర్గాల అభ్యున్నతి కోసం వెనుకబడిన మాదిగ వర్గాన్ని ముందుకు నడిపించిన ఘనత మందకృష్ణ మాదిగదని ఎమ్మార్పీఎస్ నాయకులు కొనియాడారు. ఈ సందర్భంగా 31వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఏర్పాటు చేసుకొని జెండాను ఆవిష్కరించారు. అనంతరం మందకృష్ణ మాదిగ జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేశారు.
మాజీ ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి హాజరవగా ఎమ్మార్పీఎస్ నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బాబుల్ రెడ్డి, చంద్రారెడ్డి, అంబేద్కర్ సంఘం నాయకులు, ఎమ్మార్పీఎస్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.
చేగుంటలో...
చేగుంట : మండల కేంద్రమైన చేగుంటలో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు కొలుపుల రామస్వామి మాదిగ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. అనంతరం మంద కృష్ణమాదిగ జన్మదిన వేడుకలను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు కొలుపుల రామస్వామి మాదిగ, కోషాధికారి బక్క సాయి బాబా మాదిగ, ఖాజీపూర్ వెంకన్న మాదిగ, శంకర్ మాదిగ, లీలా రాములు, చిన్న ఎల్లం మాదిగ, జిల్లా నాయకులు వరిగంట అశోక్ మాదిగ, శీను మాదిగ,మాదిగ,నాయకులు తదితరులు పాల్గొన్నారు.