అలా అయితే సినిమాలు చేయలేం

29-04-2024 12:05:00 AM

  • ‘సీతారామం’ చిత్రంతో తెలుగు చిత్రసీమలో కాలు మోపింది మహారాష్ట్ర ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. ఆ పాత్రలో కట్టు.. బొట్టు..  నటనతో చేసిన కనికట్టు చూసి సాక్షాత్తూ సీతే అనుకున్నవారెందరో. తొలి సినిమాతోనే అంతలా ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది మృణాల్. అయితే సినిమా అన్నాక.. అందులోనూ హీరోయిన్ అంటే అభినయంతో పాటు అందము ప్రధానమే. అందంగా కనపడటం కూడా అభినయంలో భాగమే అన్న వాదన లేకపోలేదు. శృంగార రసంలో భాగంగా ముద్దు సన్నివేశాలు నేటి సినిమాల్లో బాగానే ఉంటున్నాయి. ఇటువంటి సన్నివేశాలు చేసే వారికి ‘నటన’ అనిపించినా.. చూసే వారి కుటుంబ సభ్యులకి ఇబ్బందిగా ఉంటుంది.

  • అయితే ఈ విషయంపై తన అభిప్రాయాన్ని  బహిర్గతం చేసింది ఈ నటీమణి. ముద్దు సన్నివేశాలు కూడా సినిమా కథ, పాత్రానుసారం వచ్చేవే అని అంటున్న మృణాల్, అటువంటి వాటిలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పకనే చెప్పారు. దీనిపై తన తల్లిదండ్రులతోనూ చర్చించన సంగతి ప్రస్తావిస్తూ “అంతకుముందు ముద్దు సన్నివేశాల్లో నటించవద్దని తమ తల్లిదండ్రులు చెప్పగా, దాని వల్ల తను కొన్ని మంచి అవకాశాలను కోల్పోయినట్టు” తెలిపారు. తర్వాత తాను వారికి నచ్చజెప్పి సినిమాలు చేస్తున్నా”నంటూ తన ఇష్టకష్టాలను పంచుకున్నారు. అంతేగాక అసలు అలా అయితే సినిమాలు చేయలేం అని ఖరాఖండిగా చెప్పేసింది. ‘సీత’గా మైమరిపించినా, ‘యష్న’గా అలరించినా ‘ఇందు’ వంటి వివిధ పాత్రల్లో మెప్పిస్తుందంటే కెరీర్ పట్ల తనకున్న ఈ స్పష్టత వలనే మరి..!