02-07-2025 12:17:51 AM
బాన్సువాడ, జూలై 1 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని హనుమాజీపేట్ గ్రామపంచాయతీ పరిధిలోని ఛత్రునాయక్ తండాకు వెళ్లే రోడ్డు బురదమయంగా మారింది. దీంతో తండావాసులు ఇబ్బందులు పడుతున్నారు. నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంది అత్యవసర సమయాలలో అంబులెన్సులు కూడా రాని పరిస్థితి ఉందని తండా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి వర్షానికే నడవలేని పరిస్థితి నెలకొందని వాపోయారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి సీసీ రోడ్డు నిర్మించాలని కోరుతున్నారు.