02-07-2025 12:17:45 AM
రాజన్న సిరిసిల్ల: జూలై 1(విజయక్రాంతి) ప్లీజ్ డి ఎం సార్ మా స్కూలుకు బస్సు సౌక ర్యం కల్పించాలి అంటూ సిరిసిల్ల కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు డిపో మేనేజర్ ను కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ బస్ స్టేషన్ లో డిపో మేనేజర్ శ్రీనివాస్ కు విద్యార్థులు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేములవాడ ప్రాంతం నుండి కేంద్రీయ విద్యాల యానికి సుమారు వందమందికి పైగా వెళ్తున్నారని తమకు ప్రత్యేకంగా బస్సు ఏర్పాటు చేయాలని కోరారు. బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు ఆటోలను ఆశ్రయిస్తు న్నారని, దానివల్ల ఆర్థిక భారం తో పాటు పాఠశాలకు ఆలస్యం అవుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో విద్యార్థుల తో పాటు తల్లిదండ్రులుపాల్గొన్నారు.