31-01-2026 12:45:55 AM
సమ్మక్క రాక పోలీసుల ఫైరింగ్
భీమదేవరపల్లి ,జనవరి 30 (విజయక్రాంతి) హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ లోని సమ్మక్క సారలమ్మ జాతరకు శుక్రవారం సాయంత్రం వరకు సుమారు నాలుగు లక్షల పైగా భక్తులు హాజరై అమ్మవార్లను దర్శించినట్లు దేవాదాయ శాఖ అధికారులు వెల్లడించారు. గురువారం రాత్రి సమ్మక్క గద్దెకు చేరుకోగా పోలీస్ శాఖ వారు ప్రభుత్వ లాంచనాలతో గాల్లోకి కాల్పులు జరిపారు. సమ్మక్క గద్దెకు చేరుకోగానే భక్తులు లక్షలాదిగా అమ్మవారిని దర్శించారు శుక్రవారం సమ్మక్క సారలమ్మ ను మాజీ ఎమ్మెల్యే అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి, వృక్ష ప్రసాద దాత బిజెపి నాయకులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి దర్శించుకున్నారు.
అమ్మవార్ల సన్నిధిలో ఏసిపి పింగిలి ప్రశాంత్ రెడ్డి, సిఐ పులి రమేష్ ఎస్‌ఐలు ఎం రాజు, దివ్య ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. సర్పంచ్ ప్రమోద్ రెడ్డి సమ్మక్క సారలమ్మ ఉత్సవ కమిటీ చైర్మన్ జక్కుల ఐలయ్య ,డైరెక్టర్లు గీకు రూ ఐలయ్య, మాలోత్ మొగిలి మాడుగుల యాదగిరి, గుడికందుల రాజు, కొదురుపాక శ్రీనివాస్, వంగ శ్రీనివాస్, మారుపాటి శ్రీనివాస్ రెడ్డి, ఎలుక పెళ్లి రామారావు జాతరకు హాజరైన భక్తులకు సేవలు అందించారు జాతర లో భక్తులకు ఎంపిడిఓ వీరేశం, ఈవో జంగం పూర్ణచందర్ ఆధ్వర్యంలో మండల పంచాయతీ కార్యదర్శులు భక్తులకు సేవలు అందించారు.