26-11-2025 12:23:26 AM
కరీంనగర్, నవంబరు 25 (విజయ క్రాంతి): నగరంలోని ముకరంపుర, వావిలాలపల్లి ప్రాంతంలోని 23 వాణిజ్య భవన సెల్లార్లను మున్సిపల్ అధికారులు మంగళవారం తనిఖీ చేశారు. ప్రత్యేక డ్రైవ్లో భాగంగా 23 సెల్లార్లను పరిశీలించగా 16 సెల్లార్లు పార్కింగ్ నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించారు. సంబంధిత 16 మందికి నోటీసులు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బందిపాల్గొన్నారు.