26-11-2025 12:25:12 AM
జిల్లాలో సుడిగాలి పర్యటన లో పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి
మంథని, నవంబర్25(విజయక్రాంతి); ప్రజా భద్రత కోసం పోలీసులు ఎల్లప్పుడూ ప్రజల మధ్యలో ఉండాలని పెద్దపల్లి డీసీపీ భూక్యా రాంరెడ్డి అన్నారు. ఇంటివల నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆయన గోదావరిఖని ఏసిపి ఎం రమేష్ తో కలిసి గోదావరిఖని సబ్డివిజన్ పరిధిలోని గోదావరిఖని 2 టౌన్, కమాన్ పూర్, రామగిరి, మంథని, మంథని, ముత్తారం పోలీస్ స్టేషన్లను మంగళవారం సుడిగాలి పర్యటనలో సందర్శించారు.
స్టేషన్లలో నమోదైన కేసుల వివరాలు, సమస్యలు, ప్రజల జీవన విధానం, ముఖ్యమైన ప్రాంతాలు, సంస్థలు, ప్రాజెక్ట్ లు, చట్ట వ్యతిరేకమైన కార్యకలపాలు, సిబ్బంది పనితీరు, ప్రజలతో పోలీసుల వ్యవహార శైలి వంటి అంశాలను వివరంగా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ..ప్రజల భద్రత, శాంతి భద్రత నిర్వహణ, నేరాల నియంత్రణ చర్యలు, స్టేషన్ పరిధిలోని సమస్యలు, పెండింగ్ కేసులు, లా అండ్ ఆర్డర్ అంశాలపై మాట్లాడారు.
అలాగే పోలీస్ స్టేషన్ పరిసరాలు, రికార్డు నిర్వహణ, రిసెప్షన్ విధులు, పెట్రోలింగ్, బ్లూ క్లోట్స్ సిబ్బంది విధులు, డయాల్ 100 కాల్ స్పందన పై సిబ్బంది తో మాట్లాడారు. సీసీ కెమెరాల పనితీరు, తదితర అంశాలను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు.డీసీపీ వెంట గోదావరిఖని టూ టౌన్ సీఐ ప్రసాద్ రావు, మంథని సిఐ రాజు, ఎస్‌ఐ రవికుమార్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.