10-09-2025 12:26:40 AM
అమీన్ పూర్, సెప్టెంబర్ 9 :పల్నాడు జిల్లా దాచేపల్లిలోని తిరుమల ఫంక్షన్ హాలులో జాతీయ స్థాయి ఇన్విటేషనల్ షోటోఖాన్ కరాటే ఛాంపియన్ షిప్ 2025 పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సీనియర్ కరాటే మాస్టరు కొప్పుల నరసింహారావు ఆధ్వర్యంలో జరుగుతున్న పోటీలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వచ్చిన సుమారు 500 మంది విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ స్కూల్ నుండి క్రేజీ క్రేవ్ కరాటే అకాడమీ మాస్టర్ సంతోష్ రెడ్డి స్టూడెంట్స్, బాయ్స్ బ్లాక్ బెల్ట్ క్యాటగిరీ గ్రాండ్ ఛాంపియన్షిప్ సాయి అవినాష్, చేతన్, లికిత్, సాత్విక్, హన్విక్, దత్రిక ,సాయి హర్ష, ప్రసూన్, నిషిత్ , శివాష్ రెడ్డి, శ్రీయాన్, కార్తికేయ, భరత్, యశ్వంత్, సుధా శ్రీ, వేద సిద్ధార్థ ప్రత్యేక విభాగాలలో పోటీలు నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి క్రీడాకారులుగా ఎదగడానికి ఈ పోటీలు దోహద పడతాయని మాస్టర్స్ సంతోష్ రెడ్డి తెలిపారు.