calender_icon.png 8 August, 2025 | 5:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మునిరాబాద్ సమస్యలు పరిష్కరించాలి

08-08-2025 12:29:29 AM

మాజీ సర్పంచుల డిమాండ్

మేడ్చల్ అర్బన్, ఆగస్టు 7 : మున్సిపాలిటీలో విలీనమైన తర్వాత మునిరాబాద్ సమస్యల వలయంగా మారిందని మాజీ సర్పంచులు అన్నారు.  పన్నుల వసూళ్లపై ఉన్న శ్రద్ధ సమస్యల పరిష్కారంలో లేదని  గ్రామ మాజీ సర్పంచులు గణేష్ నేత చిట్టిమిల్ల, కైరంకొండ గణేష్ నేత, గూడూరు శ్రీనాథ్ రెడ్డి  మునీరాబాద్ వార్డ్ కార్యాలయంలో వార్డ్ అధికారి అశ్వంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పేర్కొన్నారు.

  గ్రామంలో గత సంవత్సర కాలంగా అపరిస్కృతంగా ఉన్న వైకుంఠ దామం చుట్టూర డ్యామేజి అయిన దగ్గర పెన్సింగ్ వెయ్యాలని,డంపింగ్ యార్డ్ ని శుభ్రపరచి వినియోగంలోకి తేవాలని,4 ఎకరాలలో విస్తరించి ఉన్న నర్సరీని, పార్క్ ను రీ ఓపెన్ చేసి ప్రజా ఉపయోగంలోకి తేవాలని,2 ఎకరాలలో విస్తరించి ఉన్న క్రీడా ప్రాంగనంలోని పిచ్చి మొక్కలు, గడ్డి తొలగించి విద్యార్థులు, క్రీడాకారులు ఉపయిగించుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

మెయిన్ రోడ్డును ప్రతిరోజూ, అంతర్గత రోడ్లను వారానికి ఒక సారి ఊడ్చాలని,రోడ్లపైకి నీటిని వదిళుతున్న వారిపై చర్యలు తీసుకొని రోడ్లను కాపాడాలని కోరారు. గ్రామంలోని ప్రతి రోడ్డుకు వెలుతురూ వచ్చేలా ఎల్ ఈ డి లైట్లు ఏర్పాటు చెయ్యాలని,నెలలో కనీసం మూడుసార్లునా దోమల మందు పిచికారి చెయ్యాలని తెలిపారు.చెత్త సేకరణ వాహనం ఇంటింటికి వచ్చేలా చూడాలని, గల్లీలలో ఆరు బయట చెత్త వేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

పై సమస్యలపై  సమావేశంలో పాల్గొన్న వారందరు కూలంకశంగా చర్చించి,పరిష్కార మార్గాలను కూడా సూచించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు బలరాం రెడ్డి, మాజీ వార్డ్ సభ్యులు ఏనుగు నాగరాజు రెడ్డి, కుతాడి నరేందర్,గ్రామస్థులు బాలరాజు, సురేష్, బిక్షపతి, శ్రీనివాస్ రెడ్డి, వీరేష్, నాగరాజు, నరేష్,యాదగిరి, మాధవరెడ్డి, వెంకటేష్, శేఖర్,స్వామి, తదితరులు పాల్గొన్నారు.