08-08-2025 12:28:06 AM
అల్‌ఫోర్స్ విద్యా సంస్థల ఛైర్మన్ నరేందర్ రెడ్డి
ఘట్ కేసర్, ఆగస్టు 7 : విద్యార్థులు ముందే ఓలక్ష్యం ఎంచుకొని ఆదిశగా ముందుకు సాగాలని ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల ఛైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు. ఘట్ కేసర్ మున్సిపల్ పరిధి కేపాల్ లోని కేఎస్‌ఆర్ ఫంక్షన్ హాల్లో గురువారం జరిగిన జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని కళాశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను సత్కరించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు స్థానికేతర ప్రాంతాలలో సీటు వచ్చిన చదవడానికి సిద్దపడాలని, దీని ద్వారా కమ్యూనికేషన్ స్కిల్స్ తో పాటు వివిధ ప్రాంతాల విద్యార్థులతో కలసి చదువుకోవడం వలన వివిధ రకాల సంస్కృతులు సాంప్రదాయలపై అవగాహణ పెంపొందించుతుందని, ఇది జీవితంలో రాణించడానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులు ముందే ఓలక్ష్యం ఎంచుకొని దానికి అనుగుణంగా నడుచుకోవాలని, లక్ష్యం లేకపోతే అయోమయంలో పడిపోతారని తెలిపారు.
డాక్టర్స్ చదవడానికి ఇది మంచి తరుణమని, దేశంలోనే అత్యధికంగా మెడికల్ కళాశాలలు ఉన్న రాష్ర్టం మన తెలంగాణ అని, ప్రతి జిల్లాలో ఒకటి రెండు మెడికల్ కళాశాలలు ఉన్నాయని గుర్తు చేశారు. విద్యార్థులకు ఎక్కడా సీట్ వచ్చినా ఏ రాష్ర్టంలో వచ్చిన చదవడానికి సిద్దంగా ఉండాలని సూచించారు. క్రమశిక్షణతో చదువకొని ఎన్‌ఐటి, ఐఐటి టాప్ కళాశాలలో సీట్ సాధించే విధంగా చదువుకోవాలని తెలిపారు. ఆల్ ఫోర్స్ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే విధంగా యాజమాన్యం కృషి చేస్తుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఠాకూర్ కిషన్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.