15-08-2025 11:03:49 PM
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థులకు ఉచిత సైకిల్ పంపిణీ
మునుగోడు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ నారబోయిన రవి ముదిరాజ్
మునుగోడు,(విజయక్రాంతి): నిరుపేదలకు విద్యార్థులకు చేయూతను అందించడమే లయన్స్ క్లబ్ లక్ష్యమని మునుగోడు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ నారబోయిన రవి ముదిరాజ్ అన్నారు. శుక్రవారం లయన్స్ క్లబ్ మునుగోడు ఆధ్వర్యంలో మండల కేంద్రంలో వివిధ ప్రభుత్వ పాఠశాలల నిరుపేద విద్యార్థులకు ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమం జిల్లా పరిషత్ పాఠశాలలో మొత్తం 8 మంది విద్యార్థులకు లయన్స్ క్లబ్ మెంబర్లతో కలిసి ఆయన సైకిళ్లు అందజేసి మాట్లాడారు. విద్యార్థులు ఉన్నత విద్యలో ముందుకు సాగడానికి ఈ సైకిళ్లు ఉపయోగపడతాయని తెలిపారు. విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మంచి ఉద్దేశం సాధించిన విద్యార్థులకు ప్రతి సంవత్సరం బహుమతులను అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇతరులు ఎవరైనా సహాయ కార్యక్రమాలు చేసేవారు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేస్తే మంచి గుర్తింపు లభిస్తుందని సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇటీవల మునుగోడు మండలంలో ఏర్పడిన అనతి కాలంలోనే సేవా కార్యక్రమాలు మొదలుపెట్టిన లయన్స్ క్లబ్ మెంబర్లను స్థానికులు ప్రశంసించారు.