calender_icon.png 16 August, 2025 | 6:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి

15-08-2025 11:08:08 PM

తిమ్మాపూర్ తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి

తిమ్మాపూర్,(విజయక్రాంతి): యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని తిమ్మాపూర్ తహసీల్దార్ కర్ర శ్రీనివాస్ రెడ్డి సూచించారు. 79 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్బంగా శుక్రవారం రామక్రిష్ణ కాలనీలో గ్రామస్థాయి వాలీ బాల్ టోర్నమెంట్ ను నిర్వహించారు. ఈ సందర్బంగా ముఖ్య అతిధిగా హాజరైన తహసీల్దార్ మాట్లాడుతూ... సెల్ ఫోన్ లకు అతుక్కుపోయి సమయం వృధా చేసుకోవద్దని పేర్కొన్నారు. క్రీడలతో శారీరక దారుడ్యం పెంపొందుతుందని తెలిపారు.

క్రీడాకారులను పరిచయం చేసుకొని క్రీడను ప్రారంభించారు. నిర్వాహకులు రేవెల్లి రవి, భూతం శ్రీకాంత్, భూతం రాకేష్, కళ్లెం అజయ్, కిన్నెర శ్రీనివాస్ లను అభినందించారు. గ్రామపంచాయితీలో జాతీయ జెండా ఎగురవేసి వేడుకల్లో పాల్గొన్నారు. గ్రామం లోని శివారు ప్రాంతంలో సీపెల్లి మద్విరాజ్ నిర్వహిస్తున్న గోశాలను సందర్శించి, అక్కడ నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో వివిధ పార్టీ లకు చెందిన నాయకులు ఉన్నారు.