02-05-2025 12:44:32 AM
ప్రిన్సిపల్ సీనియర్ జడ్జి వి.శ్రీనివాసులు
గద్వాల, మే 1 ( విజయక్రాంతి ) : ప్రపంచ కార్మికుల దినోత్సవ సందర్బంగా గురువారం జిల్లా కేంద్రంలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కార్మికులకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు .ఈ కార్యక్రమం కు ముఖ్యఅతిథిగా ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి వి.శ్రీనివాసులు పాల్గొన్నారు.ముందుగా కార్మికుల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
కార్మికుల యొక్క చట్టాల గురించి వివరించారు. కార్మికులందరూ లేబర్ కార్డు,ఇస్రం కార్డు ప్రతి ఒక్క కార్మికుడు కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్డుల వల్ల ప్రభుత్వం యొక్క సదుపాయాలని వినియోగించుకోగదవచ్చు అన్నారు.
దళారులను నమ్మి మోసపోవద్దని మీసేవ కేంద్రం ఉపయోగించుకోవాలన్నారు. వారి యొక్క సమస్యలను దరఖాస్తు రూపంలో జిల్లా న్యాయ విజ్ఞాన సదస్సుకు అందచేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ వేణుగోపాల్,మోయిన్ పాషా అడ్వకేట్లు వి. రాజేందర్, బి.శ్రీనివాసులు,లక్ష్మణ స్వామి, తదితరులు పాల్గొన్నారు.