calender_icon.png 12 August, 2025 | 5:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశాంత వాతావరణంలో ముత్యాలమ్మ జాతర నిర్వహించాలి

12-08-2025 12:57:41 AM

హుజూర్ నగర్ సీఐ చరమందరాజు

హుజూర్ నగర్, ఆగష్టు 11: ముత్యాలమ్మ జాతరను ప్రశాంతత వాతావరణంలో నిర్వహించుకోవాలని హుజూర్ నగర్ సిఐ చరమందరాజు అన్నారు. సోమవారం పట్టణంలోని సిఐ కార్యాలయంలో ముత్యాలమ్మ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ నెల 17, 18, 21తేదీలలో జరిగే పెద్ద (ముసలి) ముత్యాలమ్మ, చిన్న (వయసు) ముత్యాలమ్మ, కనదుర్గమ్మ జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఏటా నిర్వహించే  మాదిరిగా జాతరను నిర్వహించాలని కమిటీ సభ్యులకు సూచించారు.

ముత్యాలమ్మ ఆలయాలు, కనకదుర్గమ్మ ఆలయ ప్రాంగణాలలో ఎటువంటి రాజకీయ, సామాజిక, ఆధ్యాత్మిక సంబందింత ఫ్లెక్సీలను ఏర్పాటు చేయరాదని సూచించారు. జాతరలో ఎలాంటి డిజేలకు అనుమతి లేదన్నారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేస్తామని కమిటి సభ్యులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో ముత్యాలమ్మ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.