calender_icon.png 12 August, 2025 | 5:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాగర్‌కు కొనసాగుతున్న వరద

12-08-2025 12:57:46 AM

- 4 గేట్ల ద్వారా నీటి విడుదల

- 589.30 అడుగులకు నీటిమట్టం

- ప్రాజెక్టుకు 65,800 క్యూసేక్కుల ఇన్ ఫ్లో

నాగార్జునసాగర్, ఆగస్టు 11: నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టు  పూర్తిస్థాయి నీటిమాట్టానికి చేరుకుంది. సాగర్ జలాశయానికి ఎగువ నుంచి వచ్చిన నీటిని వచ్చినట్లు ఎన్‌ఎస్పీ అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపడుతూ 65,800 క్యూసెక్కుల నీరు సాగర్ జలాశయానికి వచ్చి చేరుతుంది. దీనితో నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు కాగా ప్రస్తుతం 589.30 అడుగులవద్ద నీరు నిల్వవుంది.

డ్యామ్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 309.9543 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపడుతూ 28,785 క్యూసెక్కుల నీటిని, కుడి కాలువ ద్వారా 7086 క్యూసెక్కుల నీటిని, ఎడమ కాల్వద్వారా 5800  క్యూసెక్కుల నీటిని, ఎస్.ఎల్.బి.సి ద్వారా 1800 క్యూసెక్కుల నీటిని, లోలేవల్ కెనాల్ ద్వారా 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నుంచి మొత్తం 75,879  క్యూసెక్కుల నీటిని నాలుగు గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు.