27-12-2025 12:00:30 AM
ములకలపల్లి, డిసెంబర్ 26 (విజయ క్రాంతి):సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ సభ్యులు కుర్సం ముత్యాలు శుక్రవారం తెల్లవారుజామున అనారోగ్య కారణంగా మృతి చెందారు. సిపిఎం మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు కుర్సం ముత్యాలు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుర్సం ముత్యాలు సిపిఎం పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి అనేక పోరాటాలలో పాల్గొన్నారని అన్నారు. ముత్యాలు వికలాంగుడైనప్పటికీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారని తెలిపారు. కుర్సం ముత్యాలు మరణం సిపిఎం పార్టీ కి తీరని లోటని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండ ల నాయకులు నిమ్మల మధు, గడ్డం వెంకటేశ్వర్లు, తేజావత్ జగ్గు,కోర్సా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.