27-12-2025 01:43:18 AM
జైపూర్, డిసెంబర్ 26: ఉదయపూర్‌లో కదులుతున్న కారులో ఓ మహిళా మేనేజర్‌పై గ్యాంగ్ రేప్ చేశారు. ఈ ఘటన ఈ నెల 20వ తేదీన జరగగా ఆలస్యంగా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఐటీ కంపె నీ సీఈఓ, మహిళా ఎగ్జిక్యూటివ్, భర్తను అరె స్ట్ చేశామని ఉదయపూర్ పోలీసులు తెలిపా రు. బాధుతురాలి ఫిర్యాదు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఈనెల 20న శోభాగ్‌పురా ప్రాంతంలోని ఒక హోటల్‌లో కంపెనీ సీసీఓ తన పుట్టినరోజు, నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు.
ఆ కంపెనీ మహి ళా మేనేజర్ రాత్రి 9 గంటల ప్రాంతంలో హోటల్‌కు వచ్చింది. ఆ పార్టీ అర్ధరాత్రి 1.30 గంటల వరకు కొనసాగింది. పార్టీ తర్వాత మహిళా మేనేజర్ తిరిగి ఇంటికి వెళ్తుండగా సీఈఓ, ఎగ్జిక్యూటివ్, ఒక ఎగ్జిక్యూటివ్ భర్త తమ కారులో లిఫ్ట్ ఇస్తామని చెప్పారు. ఆ ముగ్గురూ కారులో ఆమెను ఇంటికి తీసుకెళ్లే క్రమంలో ఓ దుకాణం వద్ద ఆపి, ఆమెను కూడా సిగరెట్ తాగించారు. తర్వాత ఆ మహిళ స్పృహ కో ల్పోయింది.
తర్వాత ఆమె పాక్షికంగా స్పృహలోకి వచ్చినప్పుడు, సీఈఓ తనను వేధిస్తున్న ట్లు ఆమె గుర్తించింది. ఇంటికి తీసుకెళ్లమని పదే పదే కోరినప్పటికీ, ఆమెను ఉదయం 5 గంటల ప్రాంతంలో తన ఇంటి వద్ద దింపారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలు పూర్తిగా స్పృహలోకి వచ్చినప్పుడు, తన చెవిపోగు, సాక్స్, లోదుస్తులు కనిపించకుండా పోయాయని, తన ప్రైవేట్ భాగాలపై గాయాలను గుర్తించానని తెలిపింది. ఇప్పటివరకు సేకరించిన ఆధారాల ఆధారంగా, కంపెనీ సీఈఓ జీతేష్ సిసోడియా, ఎగ్జిక్యూటివ్ హెడ్ శిల్పా సిరోహి, ఆమె భర్త గౌరవ్‌ను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు వేగవంతం చేశారు.