27-12-2025 12:01:35 AM
బూర్గంపాడు, డిసెంబర్ 26,(విజయక్రాంతి):మండలంలోని సారపాకకు చెందిన వైష్ణవి మిల్క్‌కృష్ణమూర్తి చిన్న కుమారుడు సాయిఇటీవల శబరిమల యాత్ర ముగించుకుని తిరుగుప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. దీంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండంతో శుక్రవారం మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి రూ.10వేలు,సారపాక సర్పంచ్ కిషోర్ నాయక్ రూ.10వేలు ఉప సర్పంచ్ కన్నెదారి రమేష్ రూ.5వేలు వైద్య చికిత్స ఖర్చుల నిమిత్తం ఆర్ధిక సాయం అందించి అండగా నిలిచారు.
ఈ కార్యక్రమంలోమండల పార్టీ అధ్యక్షులు దుగ్గెంపూ డి కృష్ణారెడ్డి, ఐఎన్టీయూసీ జిల్లా యువజన అధ్యక్షులు పోతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పత్తి వెంకటేశ్వర రెడ్డి,నాయకులు తిరుపతి చంటి, కాటం వెంకట్రాంరెడ్డి,రహీమ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.