calender_icon.png 6 May, 2025 | 2:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తమ్ముడు వచ్చేది అప్పుడే

05-05-2025 12:00:00 AM

ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ (ఎస్‌వీసీ)తో హీరో నితిన్, దర్శకుడు వేణు శ్రీరామ్‌కు మంచి అనుబంధం ఉంది. ఎస్‌వీసీ బ్యానర్‌లో నితిన్ చేసిన ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రం ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. దర్శకుడు వేణు శ్రీరామ్ ఇదే బ్యానర్‌లో నాని హీరోగా ‘ఏఎంసీ’, పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా ‘వకీల్ సాబ్’ వంటి సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు.

ఈ ముగ్గురి కలయికలో వస్తోంది ‘తమ్ముడు’ చిత్రం. నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాకు ఉన్న మరో ప్రత్యేకత ఉంది. అదేంటే.. నటి లయ సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాలో ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. ఇంకా వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, స్వసిక విజయన్, బేబీ శ్రీరామ్ దీత్య వంటి వివిధ భాషలకు చెందిన నటీనటులు ఈ చిత్రంలో నటించారు.

ఆదివారం ఈ చిత్ర దర్శకుడు వేణు శ్రీరామ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా మేకర్స్ ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈ చిత్రాన్ని జూలై 4న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న విషయాన్ని ఓ స్పెషల్ వీడియో ద్వారా తెలియజేయడం విశేషం. ఈ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ వీడియో ఆద్యంతం ఆకట్టుకుంది.

ఈ చిత్రానికి బ్యానర్: శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్; సినిమాటోగ్రఫీ: కేవీ గుహన్; సంగీతం: అజనీష్ లోకనాథ్; ఎడిటర్: ప్రవీణ్ పూడి; నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్; రచన దర్శకత్వం: వేణు శ్రీరామ్.