05-05-2025 12:00:00 AM
యువ హీరో రాజ్ తరుణ్ నటిస్తున్న తాజాచిత్రం ‘పాంచ్ మినార్’. రామ్ కుడుములు దర్శకత్వంలో ఈ సినిమాను కనెక్ట్ మూవీస్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై మాధవి, ఎంఎస్‌ఎం రెడ్డి నిర్మిస్తున్నారు. క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో రాశీ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. అజయ్ ఘోష్, బ్రహ్మాజీ, శ్రీనివాస్‌రెడ్డి, నితిన్ ప్రసన్న, రవివర్మ, సుదర్శన్, కృష్ణతేజ, నందగోపాల్, ఎడ్విన్ లక్ష్మణ్ మీసాల, జీవా, అజీజ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి తొలిగీతం, టీజర్ విడుదలయ్యాయి. తాజాగా మేకర్స్ ఈ మూవీ నుంచి ‘జాను మేరీ జాను’ అనే మరో గీతాన్ని విడుదల చేశారు. శేఖర్ చంద్ర సంగీత సారథ్యంలో వినాయక్ ఆలపించిన ఈ పాటకు శ్రీహర్ష ఈమని సాహిత్యాన్ని అందించారు.
‘జానూ మేరీ జానూ చెయ్యకే పరేషాను.. తిడుతుంటే నన్నూ తిన్నట్టుంది మీఠా పాను.. ఆగవే జెర ఆగవే ఏదోటి అనవే.. గమ్మున ఉంటే ఆగమాగం ఐతాందే..’ అంటూ సాగుతోందీ పాట. ఈ గీతంలో నాయకానాయికల కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. గోవిందరాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఆదిత్య జవ్వాది డీవోపీగా, ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా, సురేశ్ భీమగాని ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.