calender_icon.png 28 September, 2025 | 7:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మనసొక.. మహానది

22-09-2025 12:00:00 AM

మనసు తత్వం తెలియాలంటే..

దుఃఖాన్ని ప్రేమలో ముంచి

వాక్యాల్ని కవనంపై ఆరేయాలి 

మనసున సోపతి

కొలువు దీరాలంటే...

రక్తానికి మమతను అద్ది 

మానవత్వ సిరులను హత్తుకోవాలి

మనసు ఆకళ్ళు ఆవిరై పోవాలంటే...

స్థితప్రజ్ఞతను

గుండె కొండకు వేలాడదీసి 

క్షీరసాగర మథనం చేయాలి

మనసు నవ్వులు రువ్వాలంటే...

హృదయం స్వార్థపు కారాగారాన్ని వీడి 

స్వేచ్ఛా తంత్రులతో రెక్కలు తొడగాలి

మనసూ దేహం 

ఒక్కటిగా పులకించాలంటే...

క్రియలు చీకటి తెరల్ని చీల్చుకొని

వెలుగు కిరణాలను తొడుక్కోవాలి

మనసొక మహానది కావాలంటే....

కల్మషాలను కడిగేసుకుంటూ..

కన్నీటి వాగుల్ని దాటేసుకుంటూ

సుదీర తీరాలకు ప్రవహించాలి...!