calender_icon.png 21 November, 2025 | 3:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫోర్జరీ సంతకాలతో నా ఇల్లును కబ్జా చేశారు

21-11-2025 12:10:57 AM

రెవెన్యూ ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు ఆరోపణలు

రేగొండ/భూపాలపల్లి,నవంబర్ 20(విజయక్రాంతి): భూపాలపల్లి కారల్ మరక్స్ కాలనీ లో తనకు ఉన్న 350 గజాలు,అందులో ఉన్న పెంకుటిల్లును మొగుళ్లపల్లి తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ అసిస్టెంట్ వేమా లక్ష్మణ్ పోర్జరీ సంతకాలతో ము న్సిపాలిటీలో నమోదు చేసుకున్నాడని మూగ రాజాగట్టు అనే బాధితుడు విలేకరుల సమావేశంలో తెలిపాడు.

ఈ విషయంపై జిల్లా కలెక్టర్,మున్సిపల్ కమిషనర్ కు ఆధారాలతో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.అంతేకాక ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ తమను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు.

2000 సంవత్సరంలో భూపాలపల్లికి చెందిన వెలిశెట్టి రాజయ్య తనకు శేఖర్ వద్ద నుండి అట్టి ఇల్లును, భూమిని కొని ఇచ్చాడని ఆ క్రమంలో స్టాంపు కాగితంతో పాటు వెలిశెట్టి రాజయ్య,ముద్ధసాని రాజయ్య,చిలకని నరసింహులు సాక్షులుగా ఉన్నారన్నారు.2000- 2004 వరకు ఆ ఇంటిలో నివాసం ఉండి తన పేరు మీద గ్రామపంచాయతీ నెంబర్,నల్లాను తీసుకున్నట్లు పేర్కొన్నారు.

అనంతరం తనకు బంధువుగా ఉన్న లక్ష్మణ్ వద్ద కొంత అప్పుగా తీసుకున్నానని,ఆ తర్వాత వడ్డీ తో సహా చెల్లించడం జరిగిందాన్నారు.ఆదేవిధంగా 2004 నుండి తాను ఆర్టీసీ లో ఉద్యోగ రీత్యా మంధని లో ఉండగా ఆలాగే సదరు ఉద్యోగి భూపాలపల్లి ఆర్డీవో కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నప్పుడు తన పలుకుబడితో మున్సిపల్ కార్యాలయంలో నా ఇల్లు ను విక్రయించినట్లు దొంగ కాగితాలు సృష్టించి మున్సిపల్ ఆఫీస్ లో ఆన్లైన్లో ఇంటిని చేర్చుకున్నాడని ఆరోపించారు.

ఈ విషయంపై పలుమార్లు లక్ష్మణ్ తో మాట్లాడితే నీకు ఇల్లు ఎక్కడిది అది నాదే అంటూ నా పైనే కేసులు పెట్టీ భయాందోళనకు గురి చేశాడని అన్నారు.తప్పుడు పత్రాలతో నా ఇంటిని కబ్జా చేసిన రెవెన్యూ ఉద్యోగి లక్ష్మణ్ పై విచారణ జరిపి వెంటనే చర్యలు తీసుకోవాలని,నాకు తగిన న్యాయం చేయాలని బాధితుడు రాజగట్టు మీడియా ముఖంగా డిమాండ్ చేశారు.

మా సంతకాలను ఫోర్జరీ చేశాడు.

భూపాలపల్లి కారల్ మారక్స్ కాలనీలో రాజగట్టు కు చెందిన ఇల్లు విక్రయంలో ఉన్న తమ సంతకాలను రెవెన్యూ ఉద్యోగి వేమ లక్ష్మణ్ ఫోర్జరీ చేశారని సాక్షులు ముద్దసాని రాజయ్య,వెలిశెట్టి రాజయ్య,చిలుకాని నర్సింహులు పేర్కొన్నారు.భూపాలపల్లి లో శేఖర్ అయ్యర్ నుండి 2000 సంవత్సరంలో రాజకట్టు అతనికి తాను ఇంటిని స్థలమును కొనుగోలు చేసి ఇవ్వడం జరిగిందని సాక్షులు వెలిశెట్టి రాజయ్య పేర్కొన్నారు.

2000 సంవత్సరం నుండి తన ఇంటిలో ఉంటూ గ్రామపంచాయతీ ఇంటి నెంబర్ తో పాటు నీటి నల్లాని తీసుకున్నాడు.రెవెన్యూ శాఖలో పనిచేసే వేమా లక్ష్మణ్ కావాలని తమ సంతకాలను ఫోర్జరీ చేసి విక్రయించినట్లు మున్సిపల్ కార్యాలయంలో అధికారుల అండదండలతో తన పేరు పైన ఇల్లు చేసుకోవడం అన్యాయమని అ న్నారు.

అక్రమంగా తాము లేకున్నా సాక్షులుగా తమ పేర్లను ఫోర్జరీ చేసిన రెవెన్యూ ఉద్యోగిపై వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని భూపాలపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సాక్షులు తెలిపారు.ఈ విషయంలో ఎలాంటి తాత్సారం చేయకుండా వెంటనే బాధితుడి రాజగట్టుకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.