calender_icon.png 21 November, 2025 | 4:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమన్వయంతో ముక్కోటి ఉత్సవాలను విజయవంతం చేయండి

21-11-2025 12:11:48 AM

అధికారులను ఆదేశించిన కలెక్టర్ జితేష్ వి పాటిల్ 

భద్రాచలం (విజయక్రాంతి); భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో జరిగే ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులందరూ సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు.గురువారం నాడు సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు నిర్వహణ పై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ శాఖల అధికారులకు నిర్దేశించిన పనులను ఎలాం టి లోటుపాట్లు లేకుండా సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. మహోత్సవ ఏర్పా ట్లు పర్యవేక్షణ దేవస్థానం, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారుల సమన్వయంతో పనిచేయాలని అన్నారు. తెప్పోత్సవము, ఉత్తర ద్వారా దర్శనం బందోబస్తు ఏర్పాట్లు పోలీస్ శాఖ చేపట్టాలని, భక్తులకు ఇబ్బందులు కలగకుండా నామమాత్రపు ధరలతో సౌకర్యాలు కల్పించే విధంగా లాడ్జి, హోటల్ యజమానలనులతో సమావేశం నిర్వహించి ధరల నిర్ణయించాలని సబ్ కలెక్టర్కు సూచించారు.

ఆలయ పరిసరాల్లో సీసీటీవీ లు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. భ ద్రాచలం, దుమ్ముగూడెం లోని దేవాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని సూచించారు. భక్తులు మహోత్సవాలు వీక్షణకు ఎల్‌ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేయాలని, హంస వాహనం తనిఖీ చేసి దృవీకరణ నివేదిక సమర్పించాలని ఇరిగేషన్ ఈ ఈ ని ఆదేశించారు. హంస వాహనంలోకి పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతించా లన్నారు. భక్తులు గోదావరిలోకి వెళ్లకుండా పటిష్ట బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఆహార పదార్థాలు నాణ్యతను తనిఖీ చేసి నివేదిక అందజేయాలని ఆహార తనిఖీ, తూనికలు కొలత శాఖల అధికారులను ఆదేశించారు.భద్రాచలం పట్టణంలో మరియు పర్ణశాలలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. దుమ్ముగూడెంలో ప్రత్యేక టీములను ఏర్పాటు చేసి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ప్రతి సెక్టార్కు ఏర్పాట్లు పర్యవేక్షణకు జిల్లా అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించనున్నట్లు తెలిపారు. భక్తులకు సురక్షిత మంచినీరు సరఫరా చేయాలని చెప్పారు.

భక్తులకు బస్సులు, రైల్వే సమయాలను, అలాగే జిల్లాలోని ప్రముఖ దర్శనీయ స్థలాలను తెలియజేయు చార్టులు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ఎటువంటి లోటుపాట్లు రాకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తులు వాహనాలను పార్కింగ్ చేయడానికి ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలకు సైనేజ్ బోరడ్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. అంతేకాకుండాభద్రాచలం కరకట్ట, తెప్పోత్సవం వైకుంఠ ద్వార దర్శనం దగ్గర టాయిలెట్లు ఏర్పాట్లు చేయాలని, ప్రస్తుతం భక్తుల కోసం ఏర్పాటుచేసిన టాయిలెట్లు సరిపడా ఉండేలా చూసుకోవాలని, అవసరమైతే ఐటిసి వారి సహకారంతో టెంపరరీ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని అన్నారు.

ఏకాదశి కార్యక్రమాలతో పాటు భక్తులు దర్శనీయ స్థలాలకు వెళ్లే విధంగా అలాగే ఈసారి భద్రాచలం పర్యాటక కేంద్రం అభివృద్ధి పరచుటకు బుజ్జి గొప్ప, బెండలపాడు, రథం గుట్ట, పగిడేరు ప్రాంతాలను దర్శించే విధంగా ఏర్పాటు చేయాలని, మరియు గిరిజన సాంప్రదాయ వంటకాలు, వస్తువులు ప్రతిబింబించే విధంగా ఎస్ హెచ్ జి మహిళలు మరియు ఆదివాసి గిరిజన మహిళల తో గోదావరి కరకట్టలపై స్టాల్స్ ఏర్పాటు చేసి సాంప్రదాయకమైన గిరిజన వంటకాలు ప్రదర్శించేలా చూడాలని అన్నారు.

ఎక్సైజ్ శాఖ తరపున తెప్పోత్సవం ఉత్తర ద్వార దర్శనం అయిపోయే వరకు భద్రాచలం తో మొదలుకొని ఏకపాక వరకు బార్ షాపులన్నీ బంద్ చేయాలని, ఐటీసీ వారి సహకారంతో గ్రామపంచాయతీ సిబ్బంది సమన్వయం చేసుకొని గోదావరి బ్రిడ్జి పై సీట్ లైట్లు ఏర్పాటు చేయాలని, ఈ సంవత్సరం భక్తులు ఎవరు ప్లాస్టిక్ కవర్లు వినియోగించకుండా చూసి జూట్ బ్యాగులు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు. గ్రామపంచాయతీ సిబ్బంది భద్రాచలం పట్టణంలో డస్ట్ బిన్ లు ఏర్పాట్లు చేయాలని అన్నారు.

ఈ సంవత్సరం గోదావరిలో బోటింగ్ పాయింట్ లైఫ్ జాకెట్లు అందుబాటులో ఉంచి గజఈతగాళ్లను సిద్ధం చేసి పర్యాటకులు నామమాత్రం రుసుముతో గోదావరిలో విహరించేలా తగిన ఏర్పాట్లు చేయాలని అన్నారు. భక్తులకు సరిపడా ప్రసాదం కౌంటర్లు లడ్డు కౌంటర్లు ఏర్పాట్లు చేయాలని, యాత్రికులు చిన్న పిల్లలు తప్పిపోయిన సమాచారం అందించడానికి ప్రధానమైన కూడళ్లలో సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయాలని అన్నారు.ఈ సమావేశంలోజిల్లా ఐటీడీఏ పీవోబి.రాహుల్, సబ్ కలెక్టర్ మ్రినాలి శ్రేష్ట,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, దేవస్థానం ఈఓ దామోదర్ రావు,కొత్తగూడెం ఆర్డీవో మధు, డీఎస్పీ పాల్వంచ సతీష్ మరియు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.