calender_icon.png 13 August, 2025 | 12:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సృష్టి దర్జీ చేతిలో నా ఆత్మ !

11-08-2025 12:00:00 AM

జీవితం మెత్తగా మెరుస్తున్న బంగారు చొక్కా కాదు నా చర్మమే నా ఏకైక వస్త్రం. ఒక్కో పొర విప్పితే, దానిలో ఒక మౌనగాథ ఉంటుంది. అది బాహ్యం నన్ను కప్పినా, అంతరంలో నేను నగ్నుడినే’ వర్ణించలేని ఒక ఆత్మ మాత్రం మౌనంగా మెరుస్తోంది. ఈ దేహం ఆకలికి కట్టుబడిరది. కలలతో నెమ్మదిగా కుట్టబడిరది. నా రూపాన్ని ఆవిష్కరించేది  నా చర్మ రహస్యమే. కాలం నా జీవన రేఖలు ముడులను లాగుతూ మెలికలు వేస్తోంది. 

ప్రతి పోర, పిగిలిన చీలిక కాలం లేపనంతో వాటిని అతుకిస్తుంది. నా శరీర నిర్మాణ దృశ్యం ఒక అపూర్వ రేఖ గణీత పరిమితులతో బంధించబడింది ఒక వక్రత, ఒక చతురస్రం, ఒక తార్కిక కోణం ఆ రేఖల మధ్యన నేను  మౌనంగా ఊగే ప్రతిబింబం నా మౌలిక ఆకారాల్లోనే తిరుగుతున్న ఆత్మ. నా శరీరం పూ పుప్పొడులతో  అలంకరించబడలేదు.. దానిలో ఊది దారాలలాంటి నరాల పొరల్లో మౌన రోదన వయసు లెక్కలతో సడలిపోయే మాన కాంతి అందం సుగంధం ఆవిరవుతుంది. 

నాలో నిక్షిప్తమైన సత్యం మాత్రమే  ప్రకాశిస్తుంది ఆ నీడలో సుడులు తిరుగుతూ  తాళం వేసే శ్వాస నా మనిషిత్వాన్ని ఒక పవిత్ర వస్త్రంలో దాచిన  నీడలా అనుసరించింది స్నేహం, ప్రేమ, ఆకలి, కోపం ఇవి వర్ణాలు వదిలే ఆ అంతర్యామి  చేతిలోని రంగులుఅవి నా మనసు తెరపై ఆర్ద్రమైన చిత్రాలుగా రచించబడుతాయి నన్ను పంచమూలకాలతో మలిచింది అవి వాయువు, నీరు, అగ్ని, భూమి, ఆకాశం అయ్యాయి.

 ఒక్కో మూలకం ఒక పవిత్ర ముడిగా ఒక్కో క్షణం అర్థం వెతుకుతూ సమయం పయనిస్తుంది.  కాలం ‘ మౌనంగా కదిలే దారాల చేతి సూదిగా మారి నా ఆత్మకు జీవమయిన కథని జతచేసింది. నా నరాలు ‘ నా జ్ఞాపకాల గీతలు, నా ఎముకలు ‘తాపత్రయానికి ఆకారాలునా రక్తం ‘ మౌనంగా ప్రవహించే భక్తి గంగా, దానిలో శ్రుతి చేసేది ఒకటే రాగం మనసును మీటే నిశ్శబ్దపు స్వర పరిచయం.

నేను సంపూర్ణుడిని కాదు కానీ నేను పవిత్రుడిని. ఎందుకంటే ? అది నన్ను ముడివేసే వెచ్చని స్పర్శ సూత్రంగాయం ప్రేమ దాచలేనంతగా  విస్తరించినప్పుడూమిగిలిప ఊకైక ముడి ‘తిమిరమైందికంటి తడి సజల దృశ్యమై మిగిలింది.