23-08-2025 01:27:44 AM
- పదో తరగతి విద్యార్థే హంతకుడు
- ఖర్చుల కోసం సహస్ర ఇంటికి దొంగతనానికి వెళ్లిన నిందితుడు
- నిందితుడిని జువైనల్ హోమ్‌కు తరలించిన పోలీసులు
మేడ్చల్, ఆగస్టు 22(విజయ క్రాంతి)/కూకట్‌పల్లి: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిం చిన కూకట్‌పల్లి బాలిక సహస్ర హత్య కేసు మిస్టరీ వీడింది. పక్కింటి పదో తరగతి చదివే విద్యార్థి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నా యి. కూకట్‌పల్లిలోని సంగీత నగర్ లో ఈనె ల 18న ఇంట్లో ఒంటరిగా ఉన్న సహస్ర అనే పదేళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది.
తండ్రి కృష్ణ ఇంటికి రాగా డోరుకు బయట గడియ పెట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా కూతురు రక్తపు మడుగులో విగత జీవిగా పడి ఉంది. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సమీపం లోని సీసీ ఫుటేజితో పాటు వివిధ కోణాల్లో దర్యాప్తు చేశా రు. ఒక అనుమానిత బాలుడని అదుపులోకి తీసుకొని విచారించగా విస్తుపోయే విషయాలు వెల్లడయ్యా యి. దొంగతనానికి రెండు రోజుల ముందు నిందితుడు దొంగతనం ఎలా చేయాలని ప్లాన్ చేసుకున్నాడు.
సహస్ర తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో వీరింట్లో దొంగతనానికి వచ్చాడు. డబ్బు దొంగిలించే ప్రయ త్నం చేస్తుండగా సహస్ర గమనించింది. దీంతో తన బండారం బయట పడుతుందని భావించి ఆమెను హత్య చేయాలని నిర్ణయానికి వచ్చాడు. వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. శరీరం మీద మొత్తం 20 కత్తిపోట్ల అయ్యాయి. అందులో 10 మెడ మీదనే ఉన్నాయి.ముందుగానే బుక్‌లో రాసుకొని వచ్చి ఆ బాలుడు దొంగతనానికి వచ్చిన తీరు చూసి ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు విస్మయానికి గురయ్యారు.
ఇంట్లోకి ఎలా వెళ్లాలి, ఏమి చేయాలి, ఎవరైనా అడ్డు వస్తే ఎలా వ్యవహరించాలి అని ముందుగానే బుక్కులో రాసుకొని వచ్చాడు. అలాగే ఆధారాలు సైతం దొరకకుండా ప్లాన్ చేశా డు. ఇలాంటి కేసుల్లో డాగ్ స్క్వాడ్ ఆధారంగా నిందితులను వెంటనే గుర్తిస్తారు. కానీ ఈ కేసులో నిందితుడిని పట్టుకోడానికి పోలీసులకు ఐదు రోజులు పట్టింది.హత్య జరిగిన రోజు ఆ బాలుడు పోలీసులకు కట్టుకధలు చెప్పాడు. పెద్ద శబ్దం వినిపించిందని, డాడీ అని మూడుసార్లు అరిచిం దని చెప్పాడు.
బాలుడి ఇంట్లో సోదాలు చేయగా ముందుగా రాసుకున్న నోట్, కత్తి దొరికాయి. ఆ ఇంటి సమీపంలోని ఓ వ్యక్తి ఇచ్చిన క్లూ ఆధారంగా ఆ బాలుడిని పట్టుకొని విచారించగా నేరం అంగీకరించినట్లు తెలిసింది. ఖర్చుల కోసం దొంగతనం చేయాలని ఆ బాలుడు నిర్ణయించుకున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సహస్ర బోయినపల్లిలోని కేంద్రీయ విద్యాలయంలో ఆరో తరగతి చదువుతోంది. హత్య జరిగిన రోజు క్రీడోత్సవాలు నిర్వహిస్తుండడంతో సహస్ర పాఠశాలకు వెళ్లలేదు.
తమ్ముడు స్థానికంగా ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాడు. తండ్రి కృష్ణ మెకానిక్ చేస్తుండగా, తల్లి రేణుక ఆస్పత్రిలో పనిచేస్తుంది. కాగా బాలుడి కుటుంబం స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒంగోలు కాగా, తల్లి ఇక్కడ కిరాణా షాపు నిర్వహిస్తోంది. కాగా పోలీసులు ఈ కేసులో వాస్తవాలు నిగ్గు తేల్చే పనిలో పడ్డారు. మరోసారి క్లూస్ టీం హత్య జరిగిన స్థలాన్ని రెండోసారి పరిశీలించి ఆధారాలు సేకరించింది.