calender_icon.png 9 January, 2026 | 9:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముమ్మరంగా నాగోబా జాతర ఏర్పాట్లు

07-01-2026 12:14:26 AM

జాతర ఆవరణలో ఇంకుడు గుంతల నిర్మాణం

ఉట్నూర్, జనవరి 6 (విజయక్రాంతి): ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర కోసం ముమ్మరంగా ఏర్పాట్లు చేపడుతున్నారు. ఈనెల 18న నాగోబా మహా పూజతో ప్రారం భం కానున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రాజర్శి షా ఆదేశాల మేరకు కేస్లాపూర్ లోని నాగోబా జాతరలో భక్తుల కోసం అధికార యంత్రాం గం ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ రాజర్శి షా, ఐటీడీఏ పీఓ యువరాజ్  మార్మాట్ ల నాగోబా జాత ర జాతర నిర్వహణ ఏర్పాట్ల ను పరిశీలించారు.

ఈ సందర్భంగా అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. దీంతో అన్ని శాఖల బుధవారం భక్తుల కోసం తాత్కాలికంగా ఏర్పాటులను ప్రారంభించారు. మెస్రం వంశస్థులు వారం రోజులు పాటు ఉండే మర్రి చె ట్లు, గోవాడ ప్రాంతంలో శుభ్రం చేయడంతో పాటు  మరుగుదొడ్లు, స్నానపు గదులు ఏర్పా టు చేస్తున్నారు. మెస్రం వంశస్తులకు, భక్తులకు తాగునీటికి ఇబ్బందులు కలవకుండా పైప్ లైన్ ఏర్పాటు చేస్తున్నారు.

జాతరకు వచ్చే భక్తుల కోసం గుంతలమైన రోడ్డులకు పంచాయతీరాజ్ శాఖ  ఇంజనీరింగ్ అధికారులతో పాటు ఐటిడిఏ ఇంజనీరింగ్ అధికారులు మరమ్మత్తు పనులు ప్రారంభించారు.. నీటి పొదు పు కోసం ఇంకుడు గుంతలు.. నాగోబా జాతరలో నీటిని వృధా చేయకుండా.. నీటి వల్ల జాతర ఆవరణలో బురద ప్రాంతం కాకుండా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేస్తున్నామని డిఆర్డిఓ పి.డి రాథోడ్ రవీందర్ అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈనెల 13 లోగా ఇంకుడు గుంతలను నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. ఆయనతో పాటు డిఈఈ పవార్ రమేష్, శివప్రసాద్, ఈసీ జాదవ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.