calender_icon.png 26 May, 2025 | 4:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కానిస్టేబుల్ కుమారుడికి జాతీయ స్థాయి గుర్తింపు

26-05-2025 12:50:46 AM

- సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో రాష్ట్రంలో 2వ ర్యాంక్, దేశవ్యాప్తంగా 80వ స్థానం

నాగర్కర్నూల్, మే 25 (విజయక్రాంతి)జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఐటీ విభాగంలో పనిచే స్తున్న కానిస్టేబుల్ టి.విక్రమ్ కుమారుడు తోటకూర అనురాగ్ రెడ్డి సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో ఉత్తమ ఫలితాలను సాధించాడు. 

దేశవ్యాప్తంగా జరిగిన 6వ తరగతి ప్రవేశ పరీక్షలో 300కి గాను 290 మార్కులు సాధించి ఆల్ ఇండియా స్థాయిలో 80వ ర్యాంకు, తెలంగాణ రాష్ట్రంలో 2వ ర్యాంకు పొందాడు.అనురాగ్ విజయాన్ని గుర్తించిన జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ప్రత్యేకంగా అభినందిస్తూ, ఇలాంటి ప్రతిభావంతులే దేశ భవిష్యత్తు స్థంభాలు అంటూ శుభా కాంక్షలు తెలిపారు. తండ్రి విక్రమ్ ప్రస్తుతం జిల్లా ఎస్పీ ఆఫీస్లో కంప్యూటర్ విభాగంలో పనిచే స్తుండగా, తల్లి భాగ్యలక్ష్మి గృహిణిగాఉన్నారు.