13-12-2025 01:49:33 AM
భార్య గెలవడంతో నెరవేరిన కల
గజ్వేల్, డిసెంబర్ 12: గ్రామ సర్పంచిగా గెలవాలన్న లక్ష్యంతో రెండుసార్లు పోటీ చేసి భర్త ఓడిపోగా, మూడోసారి భార్య పోటీ చేసి సర్పంచ్ గా గెలిచి భర్త కలను నెరవేర్చింది. గజ్వేల్ మండలం బంగ్లా వెంకటాపూర్ గ్రామంలో బిఆర్‌ఎస్ పార్టీ నుండి గత రెండుసార్లు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన కొంటే మైన నరసింహులు స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
గ్రామంలో మహిళా సమాఖ్య సిఏగా పనిచేస్తున్న నరసింహులు భార్య నాగలక్ష్మి ప్రస్తుతం జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో మహిళ రిజర్వేషన్ రావడంతో సీఏ ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచ్ గా తన భర్త సహకారంతో పోటీ చేసింది. మండలంలోనే అత్యధిక మెజారిటీతో విజయం సాధించింది. గ్రామ సర్పంచ్ గా గెలవాలన్న భర్త కలను నాగలక్ష్మి సర్పంచ్ గా గెలిచి నెరవేర్చింది. దీంతో ఆ భార్యాభర్తల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.