calender_icon.png 14 December, 2025 | 2:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర రాజకీయాల్లో సత్తా చాటుతాం

14-12-2025 12:25:17 AM

ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్

ఖైరతాబాద్, డిసెంబర్ 13 (విజయ క్రాంతి) : దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలలో ఇప్పటికే క్రియాశీలక రాజకీయాలలో రాణిస్తున్న ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐ యు ఎం ఎల్ ) రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా సత్తా చాటుతామని లీగ్ రాష్ట్ర అధ్యక్షుడు, న్యాయవాది మహమ్మద్ షకీల్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లీగ్ ముఖ్య నేతలతో కలిసి మాట్లాడారు ..కేరళ, తమిళ నాడు రాష్ట్రాలలో ఇప్పటికే సేవారంగంలో, క్రియాశీలక రాజకీయాలలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నేతలు రాణిస్తున్నారని అన్నారు.

మున్ముందు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక, జి హెచ్ ఎం సి ఎన్నికల్లో కూడా ఐ యు ఎం ఎల్ పోటీ చేస్తుందని అన్నారు. తెలంగాణలో న్యాయం, సాధికారతతో కూడిన కొత్త శకానికి నాంది పలుకుతూ నేటి నుండి రాష్ట్ర రాజకీయాల్లో అధికారికంగా అడుగుపెడుతునట్లు ఆయన తెలిపారు.

మైనార్టీలు, దళితులు, బీసీలు అణగారిన వర్గాల సమగ్ర సాధికారత కోసం, సామాజిక న్యా యం సాధించడమే లక్ష్యంగా లీగ్ పోరా టం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో షాహీద బేగం,అస్ఫియా అహ్మద్ అల్ కసేరి,షేక్ చాంద్ పాషా, సయ్యద్ ఫయాజ్ హాష్మీ,మహమ్మద్ ఫజల్, షేక్ బాజీ బాబా తదితరులు పాల్గొన్నారు.