14-12-2025 12:27:46 AM
ముషీరాబాద్, డిసెంబర్ 13 (విజయక్రాంతి): భారత దేశంలో అగ్రగామి విద్యా సంస్థలలో ఒకటైన పోదార్ ఎడ్యుకేషన్ నెట్వర్క్ నగరంలో కొత్త పోదార్ ప్రెప్ కేంద్రాన్ని ప్రారంభించినట్లు పోదార్ ప్రెప్ కోకాపేట సెంటర్ డైరెక్టర్ బిందు గడ్డిపట్టి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రారంభోత్సవంలో భాగంగా తల్లిదండ్రుల కోసం నిర్వ హించిన ’స్క్రీన్ అండ్ స్క్రీమ్ పేరెంటింగ్’ అనే వర్క్ షాప్‌ను పిల్లల విద్య, అభివృద్ధి రంగంలో పేరొందిన పోదార్ ఎడ్యుకేషన్ నెట్వర్క్ ప్రెసిడెంట్, ఎర్లీ చైల్ హుడ్ అసోసియేషన్ నిపుణురాలు డాక్టర్ స్వాతి పోపట్ వాట్స్ నిర్వహించినట్లు తెలిపారు.