calender_icon.png 14 October, 2025 | 4:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘నారాయణ’వారి ‘ఎన్‌ఎస్‌ఏటీ’

14-10-2025 01:32:14 AM

19 ఏళ్లుగా నిర్వహణ

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 13 (విజయక్రాంతి): విద్యార్థులు తమ కలలను సాకారం చేసుకోవడానికి ఒక మార్గం ఎన్‌శాట్ భారతదేశంలో అత్యంత డి మాండ్ ఉన్న స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ పరీ క్ష (ఎన్‌శాట్) గత 19 సంవత్సరాలుగా విజయవంతంగా, నిర్విరామంగా నిర్వహించబ డుతోంది.

అక్టోబర్ 5వ తేదీ, అక్టోబర్ 12వ తేదీన నిర్వహించిన ఈ పరీక్షల్లో తెలుగు రాష్ట్రాల నుంచి లక్షమందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారని నారాయణ విద్యాసంస్థల యాజమాన్యం ప్రకటనలో తెలిపింది. ఎన్‌శాట్ 5వ తరగతి నుండి 10వ తరగతుల విద్యార్థులు తమ ప్రతిభను, విద్యా నైపుణ్యా న్ని ప్రదర్శించడానికి వీలుగా ఈ స్కాలస్టిక్ టెస్ట్ నిర్వహించడుతోంది.

ఈ పరీక్షలో మం చి ప్రతిభ కనబరచిన విద్యార్థులకు కోటి రూపాయల వరకు బహుమతులతో పాటు 50 కోట్ల వరకు స్కాలర్షిప్‌ను అందించనుం ది నారాయణ విద్యాసంస్థ. ఈ సందర్భంగా నారాయణ విద్యాసంస్థల కోర్ కమిటీ సభ్యురాలు రమా నారాయణ మాట్లాడుతూ.. విద్యార్థులను ప్రోత్సహించడం, వారికి సాధికారత కల్పించడం లక్ష్యంగా నారాయణ ఎన్‌శాట్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ జాతీయ స్థాయి స్కాలర్షిప్ పరీక్షను ఎంతో మంది నిపుణులు, దశాబ్దాల అనుభవం కల్గిన మేధావులచే పరిశోధన ఆధారంగా రూపొందించ బడిన పరీక్షగా అభివర్ణించారు. విద్యార్థులు తమ అభిరుచిని అర్థం చేసుకుని, వారి భవిష్యత్ మార్గంలో ముందంజ వేయాలనే లక్ష్యంతో ఈ పరీక్షను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఎన్‌శాట్ పరీక్షకు ఎంతో క్రేజ్ ఉందన్నారు. గత 19 ఏళ్లుగా ఎంతో మంది విద్యార్థులు స్కాలర్షిప్స్ పొందుతూ తమ కలలను నెరవేర్చుకుంటున్నారన్నారు.