14-10-2025 01:32:04 AM
- వరస చోరీలతో భయబ్రాంతులకు గురువుతున్న స్థానిక ప్రజలు
- నిన్న బ్రిలియంట్ కాలేజీ రూ. 1.07 కోట్లు చోరీ
- నేడు పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిధి
- సదాశివ గ్రేటెడ్ కమ్యూనిటీలో నగదు, విలువైన ఆభవరణ అపహరణ
- పోలీసుల పెట్రోలింగ్ నిర్వాహణ లేకపోవడం వల్లే వరస చోరీలు: స్థానికులు
అబ్దుల్లాపూర్‌మెట్, అక్టోబర్ 13: నగర శివారు ప్రాంతంలో దొంగలు బీభీత్సాన్ని సృష్టిస్తున్నారు. దుండగుల వరస చోరీలతో స్థానికులు ప్రజలు భయబ్రాంతులకు గురువుతున్నారు. వీరు పగలు రెక్కీలు నిర్వహించి.. రాత్రిళ్ల సమయాల్లో దోపిడీలకు పాల్పడుతున్నారు. వీళ్ల తాళ్ళాలు వేసి ఇండ్లు, కాలేజీలను టార్గెట్‌గా పెట్టుకుని చోరీలకు పాల్పడుతున్నారు. సీపీ కెమెరాలను కూడా లెక్కచేయడంలేదు. సీపీ కెమె రాల రికార్డు అయ్యి దొంగలను పట్టించే అవకాశం ఉంటుందని దొంగలు కూడా టెక్నాల జీ పరంగా సీసీ కెమెరాల రికార్డ్ అయ్యే హార్డ్ డిస్కల్‌లతో సహా ఎత్తుకెళ్తున్నారు.
నిన్న బ్రిలియంట్ కాలేజీ..
అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిధిలోని గురువారం సాయంత్రం బ్రిలియంట్ కాలేజీ సిబ్బంది గేట్లకు, ఆఫీసు రూమ్‌కు, తాళ్లాలు వేసి వెళ్లిన తర్వాత గురువారం రాత్రి సమయంలో గేట్లు, ఆఫీసు రూం డోర్లు పగల గొట్టి బీరువాలో నుంచి రూ.1.07 కోట్లు నగదును ఎత్తుకెళ్ళారు. కాలేజీ చుట్టు దాదాపుగా 200 సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అందులో 100 సీసీ కెమెరాలు రికార్డు అయ్యే హార్డ్ డిస్క్‌కు కూడా అపహరించారు. అందుకంటే సీసీ కెమెరాలు రిక్డారు అయ్యే అవకాశాలు ఉండడం వలన దోపిడీ చేసిందే ఎవ్వరు అనేది స్పష్టంగా సీసీ కెమెరాలో రికార్డు అవుతుందని ముందస్తు జాగ్రత్తోనే సీసీ కెమెరా లు హార్డ్ డిస్క్‌లను కూడా ఎత్తుకెళ్ళారు.
నేడు సదాశివ గ్రేటెడ్ కమ్యూనిటీ..
పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిధి సదాశివ గేటెడ్ కమ్యూనిటీలో దొంగలు బీభత్సం సృష్టించిన సంఘటన శనివారం రాత్రి చోటుకుని.. అదే రాత్రి రెండు విల్లాలలో వరుసగా చోరీలు పాల్పడ్డారు. విల్లా నెంబర్ 242 రాజేందర్ రెడ్డి నివాసం ఉంటాడు. అలాగే రాజేందర్ రెడ్డికి హైదరాబాద్ అత్తాపూర్‌లో మరో ఇళ్లు ఉండడంతో ఆయన కుంటుంబ సభ్యులందరూ అక్కడే ఉంటున్నారు. అప్పుడప్పుడు ఇక్కడికి వస్తు ఉంటారు.
గ్రేటెడ్ కమ్యూనిటీ కావడంతో వారు భరోసాతో ఉన్నారు. రాజేందర్‌రెడ్డి ఇంట్లో 2.5 కిలోల వెండి, విలువైన పట్టుచీరలు, రెండు రైస్ బ్యాగులతో సహా చోరీ చేశారు. విల్లా నెంబర్ 246లో చెందిన కృష్ణారెడ్డి జ్యోతి దంపతులిద్దరు కొద్ది రోజుల క్రింతం అమెరికాకు వెళ్ళారు. వీరి ఇంటి లాకర్‌లో ఉండే 35 గ్రాముల బంగారు ఆభరణలు, 2.5 కిలలో వెండి, రూ. 60వేల నగదు దోచుకెళ్లారు. సదాశివ గ్రేటెడ్ కమ్యూనిటీలో దొంగలు పగలు సమయంలో రెక్కీ నిర్వహించి చాలా రోజుల నుంచి ఆ ఇండ్లకు తాళ్ళాలు ఉండడాన్ని గమనించి దోపిడీలకు పాల్పడినట్లు తెలుసుంది.
పోలీసులకు దొంగల సవాల్
ఎల్బీనగర్ డివిజన్ అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న బ్రిలియంట్ కాలేజీలో గురువారం రాత్రి సమయంలో కాలేజీ గేట్లు, ఆఫీసు రూంలో బద్దలు కొట్టి బీరువాలో ఉన్న 1.07 కోట్ల భారీ నగదును ఎత్తుకెళ్లారు. అప్పటి నుంచి ఆ దొంగల ముఠా కోసం పోలీసులు 15 టీమ్‌గాలు ఏర్పడి విస్తరంగా గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఇంత వరకు వారు ఆచూకీని పోలీసులు కనుకొన లేకపోయారు. బ్రిలియంట్ కాలేజీ భారీ చోరీ సంఘటన మరవ ముందే హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధి పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ సదాశివ గ్రేటెడ్ కమ్యూనిటీలో శనివారం రాత్రి రెండు ఇండ్లలో వరసగా చోరీలుగా జరగగా.. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చినప్పటికీ ఇంతరకు ఆ దొంగల కోసం ఎలాంటి ఎంక్వారీలు చేయకపోవడం చాలా విడ్డూరంగా ఉంది. దొంగలు పోలీసులకు సవాల్ చేస్తున్నారు. అలాగే పోలీసులపై నగర శివారు ప్రాంత ప్రజలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పెట్రోలింగ్ సరిగా నిర్వహించకపోవడంతో వరస చోరీలు జరుగుతున్నాయన్నారు.