26-12-2025 12:00:00 AM
రేగొండ, డిసెంబర్ 25(విజయక్రాంతి): ఉపసర్పంచ్ ల ఫోరం రేగొండ మండల అధ్యక్షులుగా మండల కేంద్రానికి చెందిన ఎల్డండి నరేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం మండలం లోని బుగులోని వెంకటేశ్వర స్వామి జాతర ప్రాంగణంలో 23 గ్రామ పంచాయితీల ఉప సర్పంచ్ లు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఉపసర్పంచుల ఫోరం మండల కమిటీని ఏర్పాటు చేసుకున్నారు.
గౌరవ అధ్యక్షుడు గా చుక్క జనార్దన్, ఉపాధ్యక్షులు గా పెండెల శంకర్, ఆకుతోట తిరుపతి, ప్రధాన కార్యదర్శిగా నీరటి రంజిత్, కార్యదర్శి గుర్రం రమేష్ , కోశాధికారిగా గడల చిన్న సాంబయ్య, కార్య వర్గ సభ్యులుగా గుర్రం రాంబాబు, రాజేష్, బండి వెంకటేష్, సకినాల రవీందర్ లను ఎన్నుకున్నారు. ఉపసర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడిగా ఎన్నుకున్నం దుకు ఎల్దండీ నరేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఉపసర్పంచ్ ల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్నారు.