21-11-2025 12:07:43 AM
- బస్సును ఢీ కొట్టిన లారీ
-భయాందోళనలో ప్రయాణికులు
చర్ల, నవంబర్ 20 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం డివిజన్లోని ఏజెన్సీ ప్రాంతమంతం లో రహదారులు అస్తవ్యస్తం పైగా నిత్యం వందల సంఖ్యలో లారీల రద్దీ దీంతో బస్సు ప్రయాణం చేయాలన్న ఆటో మ్యాజిక్లలో ప్రయాణం చేయాలని ప్రాణాల మీదకు వస్తుంది.
గురువారం భద్రాచలం నుంచి బయలుదేరిన వెంకటాపురం ఆర్టీసీ సర్వీస్ బస్సు సర్వీస్ చర్ల మీదుగా సబ్బంపేట చేరుకోగానే రహదారికి ఇరువైపులా లారీల రద్దీ కనిపించింది డ్రైవర్ కాస్త నిదానంగానే బస్సు నడుపుతున్నప్పటికీ ఎదురుగా ఉన్న లారీ ఒకసారిగా వెనకకు రావడంతో కండక్టర్ సీట్ వెనకాల బలంగా లారీ బస్సులు ఢీకొట్టింది దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు బస్సులో సుమారు 20 మంది ప్రయాణికులు వారిలో మహిళలే ఎక్కువగా ఉండడంతో ఒక్కసారిగా మహిళలంతా లారీ డ్రైవర్ పై మండిపడ్డారు,ప్రమాదం నుండి తప్పించుకున్న ప్రయాణికులు బస్సులో చిన్న పిల్లలు వృద్దులు ఉండడంతో ఆర్తనాదాలు చేశారు,