05-10-2025 12:00:00 AM
లైన్స్ క్లబ్ 320ఎ గవర్నర్ డా.జి. మహేంద్ర కుమార్‌రెడ్డి
ముషీరాబాద్, అక్టోబర్ 4 (విజయక్రాంతి): అక్టోబర్ 4 నుంచి 12 వరకు మాన సిక ఆరోగ్యం అవగాహన నవోత్సవాలను లయన్స్ క్లబ్ 320ఎ, ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు లయన్స్ క్లబ్ 320ఎ డిస్ట్రిక్ట్ గవర్నర్ డా.జి. మహేంద్ర కుమార్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం ఉదయం సుందరయ్య పార్క్ లో డా.జి. మహేంద్ర కుమార్ రెడ్డి, డిస్ట్రిక్ట్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ పి.రమేష్ చంద్రబాబు,
లియో చైర్మన్ జి. కృష్ణ వేణి, సుందరయ్య పార్క్ వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ నిరంజన్ రెడ్డి, లయన్ జి.లక్ష్మీ, జయశ్రీ, శైలజ, ఉషశ్రీ, డా.హిప్నో పద్మా కమలాకర్, ఉమెన్ అండ్ చైల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ సుపర్ వైజర్ కర్నాటక డా. స్పందన, పోస్టర్ను ఆవిష్కరించారు. డా.జి. మహేంద్ర కుమార్ రెడ్డి మాట్లాడుతూ మానసిక ఆరోగ్యం బాగుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. శనివారం మానసిక ఆరోగ్యం పై అవగాహన పెరగడానికి కారణం డా. హిప్నో కమలాకర్ అని అన్నారు.
మెంటల్ హెల్త్ అవేర్నెస్ కో-ఆర్డినేటర్ జిల్లా 320A డా.హిప్నో పద్మా కమలాకర్ మాట్లాడుతూ ఈ సందర్భంగా మహిళలు చిట్ చాట్, మగవారు మనసు సున్నితం, విద్యార్థులు - ఆత్మహత్యలు పై అవగాహన, చదువు - ఒత్తిడిపై అవగాహన తో పాటు 12 అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు.
లయన్స్ క్లబ్ 320ఎ ఆధ్వర్యంలో 5వ తేదీన సినియర్ సిటిజన్స్ డే సందర్భంగా ఎవి కాలేజీ, హైదరాబాద్ లో ఉదయం 8 గంటల నుంచి 5 గంటల వరకు ఆటలు, పాటలు, డ్యాన్స్ లు కార్యక్రమాలు, కొత్త వారిని కలవడం ఉన్నాయ న్నారు. సినియర్స్ అందరూ వచ్చి ఎంజాయ్ చేయాలని తెలిపారు.