23-12-2025 01:44:57 AM
ముకరంపుర, డిసెంబరు 22 (విజయ క్రాంతి): జిల్లాలోని తిమ్మాపూర్ మండలంలోని జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (ఆటానమస్) లో ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ అంశంపై మూడు రోజుల జాతీయ స్థాయి వర్క్ షాప్ సోమవారం ప్రారంభమైంది. సంస్థ చైర్మన్ జువ్వాడి సాగర్ రావు, సెక్రటరీ & కారస్పాండెంట్ జువ్వాడి సుమిత్ సాయి ఆధ్వర్యంలో ప్రారంభమైంది. ప్రిన్సిపాల్ డాక్టర్ టి. అనిల్ కుమార్ మాట్లాడుతూ దేశ భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహన సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని, పర్యావరణ పరిరక్షణకు ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు.
అకడెమిక్స్ & ఆడిట్ డీన్ డా. పి.కె. వైశాలి ఫలితాల ఆధారిత విద్య, పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాల అభివృద్ధి ప్రాముఖ్యతను వివరించారు. హెచ్‌ఐఈఈ ఎండి కె. మదన్ మోహన్ గౌడ్ ఎలక్ట్రిక్ వాహన రంగంలో తాజా సాంకేతిక పరిణామాలు, సవాళ్లు, ఉద్యోగావకాశాలపై అవగాహన కల్పించారు. ఈఈఈ విభాగాధిపతి డా. ప్రవీణ్ కుమార్ వర్క్ షాప్ లక్ష్యాలను వివరిస్తూ, ఎలక్ట్రిక్ వాహనాల భాగాలు, పవర్ ఎలక్ట్రానిక్స్, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి అంశాలపై ప్రాయోగిక అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు.