calender_icon.png 11 September, 2025 | 3:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సామాజిక బాధ్యతలో జర్నలిస్టుల పాత్ర అమోఘం

11-09-2025 01:06:28 AM

హాజరైన స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి, జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్. జిల్లా ఇన్చార్జి వైద్యాధికారి రవికుమార్

నాగర్ కర్నూల్ సెప్టెంబర్ 10 ( విజయక్రాంతి )ప్రజలకు ప్రభుత్వానికి వారదులుగా పనిచేసే జర్నలిస్టులు సమాజ బాగు కోసం సామాజిక స్పృహతో ఆలోచిస్తూ నిర్వహించిన హెల్త్ క్యాంప్ ప్రయత్నం అమోఘమైనదని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కుచకుల్ల రాజేష్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

బుధవారం జిల్లా కేంద్రంలోని సాయి గార్డెన్లో యశోద ఆస్పత్రి సహకారంతో తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఐజేయు యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంపును ఆయన జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, జిల్లా ఇన్చార్జి వైద్యాధికారి రవికుమార్, రత్నగిరి ఫౌండేషన్ డైరెక్టర్ జూపల్లి అరుణ్ తో పాటు ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టుల అభివృద్ధి కోసం తన వంతు సహకారం ఎల్లవేళలా ఉంటుందన్నారు. నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతూ ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చూపుతున్న జర్నలిస్టు వారి కుటుంబాలను రక్షించాలన్న లక్ష్యంతో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస రెడ్డి ఆలోచన మేరకు రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ నారాయణ సూచన మేరకు ఈ హెల్త్ క్యాంపు నిర్వహించినట్లు ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి మధుగౌడ్ తెలిపారు.

ఈ ప్రాంత జిల్లా జర్నలిస్టు కుటుంబాలకు ఉచిత మెగా హెల్త్ క్యాంపు నిర్వహణకు శ్రీ నేత్రాలయ కంటి ఆసుపత్రి, స్థానిక ఆసుపత్రి యాజమాన్యాలు సైతం సహకరించి ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలోఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. జిల్లా అధ్యక్ష కార్యదర్శులు విజయకుమార్, సురేష్ కుమార్, ఎలక్ట్రానిక్ మీడియా విభాగం అధ్యక్షులు వెంకటస్వామి, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మల్లేష్ శ్రీశైలం తదితరులుఉన్నారు.