10-12-2025 02:20:38 AM
కటక్, డిసెంబర్ 9 : టీ ట్వంటీ ప్రపంచకప్‌కు ముందు సెమీఫైనల్ ప్రిపరేషన్‌లో భావిస్తున్న సౌతాఫ్రికా సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. కటక్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టి విజయం సాధించింది. టాస్ ఓడిపోవడం ఒక విధంగా భారత్‌కు కలిసొచ్చిందనే చెప్పాలి. అయితే అంచనాలకు తగ్గట్టు టాపార్డర్ రాణించలేదు. మెడనొప్పి నుంచి కోలుకుని రీఎంట్రీ ఇచ్చిన గిల్ మరోసారి నిరాశపరిచాడు. టీ20 ఫార్మాట్‌లో తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తూ కేవలం 4 పరుగులకే వెనుదిరిగాడు. కెప్టెన్ సూర్యకుమార్(12) కూడా ఫెయిలయ్యాడు.
అభిషేక్ శర్మ 17(12 బంతుల్లో 2 ఫోర్లు,1 సిక్సర్) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. ఈ పరిస్థితుల్లో తిలక్ వర్మ, అక్షర్ పటేల్ ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ 30 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మంచి స్కోర్ చేస్తాడను కున్న తిలక్ వర్మ(26) ఔటైన కాసేపటికే అక్ష ర్ పటేల్ (23) కూడా వెనుదిరిగాడు. ఈ దశలో హార్థిక్ పాండ్యా మెరుపు బ్యా టింగ్‌తో ఆదుకున్నాడు. దూబే(11) ఔటైనప్పటకీ.. జితేశ్ శర్మతో కలిసి చివర్లో విధ్వంసం సృష్టించాడు.
భారీ సిక్సర్లతో సఫారీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 28 బంతుల్లోనే 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 59 రన్స్ చేశాడు. పాండ్యా మెరుపులతోనే భారత్ స్కోర్ 170 దాటగలిగింది. చివర్లో జితేశ్ శర్మ 10(5 బంతుల్లో) హార్థిక్‌కు సపోర్ట్ ఇచ్చాడు. పాండ్యా విధ్వంసంతో చివరి 2 ఓవర్లలో భారత్ 30 పరుగులు పిండుకుంది. అలాగే ఈ మ్యాచ్‌లో పాండ్యా తన అంతర్జాతీయ టీ20ల్లో 100 సిక్సర్ల మార్క్ అందుకున్నాడు.
పాండ్యా మెరుపులతో భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల కు 175 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 3, సిపమ్లా 2 వికెట్లు తీశా రు. ఛేజింగ్‌లో సౌతాఫ్రికా ఆరంభం నుంచే తడబడింది. రెండో బంతికే డికాక్‌కు అర్షదీప్‌పెవిలియన్‌కు పంపిం చాడు. కెప్టెన్ మార్క్మ్ ధాటిగా ఆడేం దుకు ప్రయత్నించినా భారత బౌలర్లు మిగిలిన బ్యాటర్లకు అవకాశం ఇవ్వలేదు. ఇక్కడ నుంచి సౌతా ఫ్రికా క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది.
పవర్ ప్లేలో దూకుడుగా ఆడడంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుందని అనుకున్నారు. అయితే పవర్ ప్లే ముగిసిన తర్వాత భారత స్పిన్నర్లు కూడా తిప్పేయడంతో సఫారీల కథ త్వరగానే ముగిసింది. మాక్‌ర్రన్ (14), స్టబ్స్(14), బ్రెవిస్(22), మిల్లర్ (1), ఫెరీరా (5), మార్కో యెన్సన్ (12) పరుగులకు ఔటయ్యారు. భారత పేసర్లు, స్పిన్నర్లు చెరొక ఎండ్ నుంచీ సౌతాఫ్రికాను కోలుకోకుండా దెబ్బకొట్టారు.
ఫలితంగా కనీస పోటీ కూడా ఇవ్వని దక్షిణాఫ్రికా కేవలం 74 పరుగు లకే కుప్పకూలింది. భారత బౌల ర్లలో అర్షదీప్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలా రెండేసి వికెట్లు తీయగా.. హార్థిక్, దూబే ఒక్కో వికెట్ పడగొట్టారు. హాఫ్ సెంచరీతో పాటు వికెట్ తీసిన హార్థిక్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కిం ది. సిరీస్‌లో రెండో టీ ట్వంటీ ముల్లాన్‌పూర్‌లో గురువారం జరుగుతుంది.
వన్డే సిరీస్ విజయం తెచ్చిన జోష్‌తో టీ20 సిరీస్‌లోనూ భారత్ దుమ్మురేపుతోంది. హార్థిక్ పాండ్యా మెరుపులకు తోడు బౌలర్లు సమిష్టిగా రాణించిన వేళ తొలి మ్యాచ్ లో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. షార్ట్ ఫార్మాట్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ అద్భుత విజయాన్ని అందుకుంది. పలువురు టీ20 స్టార్స్ ఉన్నప్పటకీ భారత బౌలర్ల ముందు సఫారీలు తోకముడిచారు. 74 పరుగులకే వారిని కుప్పకూల్చారు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 1 ఆధిక్యంలో నిలిచింది.
బుమ్రా @ 100 వికెట్లు
భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్‌లో అరుదైన మైలురాయి అందుకున్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 100 వికెట్ల క్లబ్‌లో చేరాడు. అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన రెండో భారత బౌలర్‌గా రికార్డులకెక్కాడు. గతంలో అర్షదీప్‌సింగ్ 100 వికెట్లు పూర్తి చేసుకోగా.. ఇప్పుడు బుమ్రా కూడా అతని సరసన చేరాడు. ఓవరాల్‌గా అన్ని ఫార్మాట్లలోనూ వందేసి వికెట్ల క్లబ్‌లో చేరిన ఐదో బౌలర్‌గానూ నిలిచాడు. మలింగ, సౌథీ, షకీబుల్, షాహీన్ అఫ్రిది బుమ్రా కంటే ముందున్నారు.
స్కోర్ బోర్డు :
భారత్ ఇన్నింగ్స్ : 175/6 (హార్థిక్ 59, తిలక్ వర్మ 26, అక్షర్ పటేల్ 23; ఎంగిడి 3/31, సిపమ్లా 2/38)
సౌతాఫ్రికా ఇన్నింగ్స్ : 74 ఆలౌట్ (బ్రెవిస్ 22, మార్క్మ్ 14, స్టబ్స్ 14; అర్షదీప్ 2/14, బుమ్రా 2/17, వరుణ్ చక్రవర్తి 2/19, అక్షర్ పటేల్ 2/7)