25-09-2024 12:00:00 AM
ఏ. మనోహర్ రెడ్డి :
ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్‌తో పాటుగా ఇతర వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీ క్షఅండర్ గ్రాడ్యుయేట్( నీట్ యూజీ)-2024 ఎన్నడూ లేని విధంగా గందర గోళంలో పడిపోయింది. దేశం మొత్తంలో ప్రభుత్వ, ప్రైవేటుభాగస్వామ్యంలో మొత్తం 680 ఎంబీబీఎస్, 329 బీడీఎస్( డెంటల్) కళాశాలలున్నాయి.
ఇందులో మొత్తం 1,06,431 ఎంబీబీఎస్, 27,868 బీడీఎస్, 52,720 ఏవైయూఎస్‌హెచ్ ఆయుర్వేద సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటి ప్రవేశాల కొరకు నిర్వహించిన నీట్-యూజీ- 24 ప్రవేశపరీక్షను దేశవ్యాప్తం గా 4750 కేంద్రాల్లో ఈ ఏడాది మే5న నిర్వహించారు. పరీక్షకు 23.33 లక్షల మంది హాజరుకాగా, 13.6 లక్షల మంది అర్హత సాధించారు.
ఈ సారి తెలంగాణనుంచి 77,849 మంది హాజరుకాగా, 47,356 మంది అర్హత సాధించారు. అయి తే నీట్ ఫలితాలు జూన్ 14వ తేదీన విడుదల చేయాల్సి ఉండగా పరీక్ష నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ( ఎన్‌టీఏ) హటాత్తుగా లోక్‌సభ ఫలితాలు వెలువడిన జూ న్ 4వ తేదీ అంటే పది రోజుల ముందే విడుదల చేసింది.
యావత్ మీడియా, దేశ ప్రజానీకం దృష్టి లోక్‌సభ ఎన్నికల ఫలితా ల మీద ఉన్న సమయంలో ఎన్‌టీఏ అలా చేయడం లక్షలాది మంది విద్యార్థులను, వారి తల్లిదండ్రులను దిగ్భ్రాంతికి గురి చేసింది.ఎన్నికల ఫలితాల హడావుడిలో ఎవరూ నీట్ పరీక్ష నిర్వహణలో, ఫలితాల్లో జరిగిన అక్రమాలను పట్టించుకో రనే ఉద్దేశంతోనే ఎన్‌టీఏ ఇలా చేసిందన్న బలమైన ఆరోపణలు వినిపించాయి.
గ్రేస్ మార్కుల గొడవ
అయితే ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు మా రడంతో పాటు మేఘాలయ, హర్యా నా, చత్తీస్‌గఢ్, సూరత్, చండీగఢ్‌లలోని మొ త్తం ఆరు ఎగ్జామ్ సెంటర్లలో ఓఆర్‌ఎం షీ ట్లు చిరిగిపోవడం, ఒక పేపర్‌కు బదులు మరో పేపర్ ఇవ్వడం, తద్వారా పరీక్ష నిర్వహణలో జాప్యం వంటి కారణాలతో 1763 మంది విద్యార్థులకు నష్టపరిహారం కింద గ్రేస్ మార్కులు ఇచ్చారు.
ఈ ఏడాది మొత్తం 67 మంది ఫస్ట్ ర్యాంకులు సాధించారు. వీరందరికీ 720కి 720 మార్కులు రావడం గమనార్హం. ఇలా జరగడం ఎన్‌టీఏ చరిత్రలో ఇదే మొదటి సారి. గత ఏ డాది కేవలం ఇద్దరికే ఫస్ట్ ర్యాంక్ వచ్చిం ది. అయితే ఈ సారి ఫస్ట్ ర్యాంక్ సాధించిన 67 మందిలో గ్రేస్ మార్కులతో ఫస్ట్ ర్యాంక్ కొట్టిన వారు 8 మంది ఉ న్నారు.
ఇదే అందరినీ ఆశ్చర్యానికి గురి చే సింది. హర్యానాలోని ఒకే పరీక్షా కేంద్రానికి చెం దిన 8 మందికి ఫస్ట్ ర్యాంక్ రావ డం, వీరి హాల్‌టికెట్ల నంబర్లు అన్నీ ఒకే సిరీస్‌లో ఉండడంతో పరీక్ష నిర్వహణపై అనుమానాలు తలెత్తాయి. దీనిపై దేశవ్యాప్తంగా వి ద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రు లు నీట్‌ను రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేయ డంతో పాటు ఆయా రాష్ట్రాల హైకోర్టుల్లో కేసులు వేశారు.
దీంతో దిగివచ్చిన కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్ర యించిం ది. అన్ని రాష్ట్రాల హైకోర్టుల్లో వేసి న కేసులపై సుప్రీంకోర్టు ధర్మాసనం స్టే వి ధించిం ది. సుదీర్ఘ విచారణ అనంతరం నీట్-24 లో ఒకటి, రెండు చోట్ల తప్పులు జరిగినా ఎన్‌టీఏ మళ్లీ పరీక్ష నిర్వహించలేదని సు ప్రీంకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పింది.
అయి తే కేంద్రప్రభుత్వం అనుమతితో 1563 మంది అభ్యర్థులకు కేటాయించిన గ్రేస్ మార్కులను రద్దు చేసి మళ్లీ పరీక్ష ని ర్వహిస్తామని ఎన్‌టీఏ తెలిపింది. సుప్రీంకోర్టు 2018లో ఇచ్చిన తీర్పులో నిర్దేశించి న ఫార్ములా ప్రకారమే అభ్యర్థులకు గ్రేస్ మార్కులు ఇచ్చామని, ఇందులో తమ సొంత నిర్ణయం ఏమీ లేదని నీట్‌ను నిర్వహించిన, ఫలితాలు ప్రకటించిన నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ చెబుతోంది.
అయితే జూన్ 23న మళ్లీ పరీక్ష నిర్వహించిన ఎన్‌టీఏ జులై 1న ఆ రీ టెస్టు ఫలితాలను విడుదల చేసింది.గ్రేస్‌మార్కుల కారణంగా 720కి 720 మార్కులు సాధించి టాపర్లుగా నిలిచిన వారికి రీ టెస్ట్‌లో ఆ మార్కులు రాలేదు. 1563 మందికి ఇచ్చిన గ్రేస్‌మార్కులను ఉపసంహరించుకోవడంతో టా పర్ల సంఖ్య 67నుంచి 61కి తగ్గిపోయింది.
అందరు విద్యార్థుల ర్యాంకుల్లో కూడా సవరణలు జరిగాయి. అయితే ప్రస్తుతం సవరించిన ర్యాంకుల ఆధారంగానే కౌన్సిలింగ్ జరుగుతున్నది. ఇప్పటికే ఆలిం డియా కోటా సీట్ల భర్తీలో రెండు రౌండ్ల ఎంపిక పూర్తయింది.
తెలంగాణలో స్థానికత వివాదం
తెలంగాణలో ప్రయివేటు, ప్రభుత్వ మె డికల్ కాలేజిల్లో మొత్తం ఎంబీబీఎస్ సీట్లు 8,690 ఉండగా, వాటిలో 31 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 3,990 సీట్లున్నాయి. అలాగే 30 ప్రయివేటు మెడికల్ కాలేజీల్లో 4,700 సీట్లున్నాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని 85 శాతం సీట్లను కన్వీనర్ కో టాలో భర్తీ చేస్తారు. ఇంకో 15 శాతం సీట్ల ను ఆలిండియా కోటాలో భర్తీ చేస్తారు.
ఇక ప్రయివేటు మెడికల్ కాలేజీల్లోని 50 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో, ఇంకో 50 శాతం సీట్లను మేపేజ్‌మెంట్ కోటాలో ను భర్తీ చేయనున్నారు. అయితే సీట్ల భర్తీకై కాళోజీ ఆరోగ్య విశ్వ విద్యాలయం సన్నద్ధమవుతుండగానే తెలంగాణ స్థానికతపై వి వాదం రాజుకుంది.
రాష్ట్ర పునర్విభజన చ ట్టంలోని ఆర్టికల్ 371డి కింద పదేళ్ల పా టు రాష్ట్రంలోని అన్ని ఉన్నత విద్యాసంస్థ లు, మెడికల్ కాలేజీల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న కోటాల ప్రకారమే ప్రవేశాలు కల్పించాలని ఏపీ విభజన చట్టం-2014లోని సెక్షన్ 95 పేర్కొంది.371-డికి ఉన్న పదేళ్ల గడువు ముగిసినందున తెలంగాణ ప్రభుత్వం నీట్ ఫలితాలు రావడానికి వా రం రోజుల ముందు కొత్త నిబంధన జీవో 33ను తీసుకువచ్చింది.
జీవో 33 లోని ని బంధన 3(ఏ) ప్రకారం తెలంగాణలో 851 స్థానిక కోటాలో వైద్యవిద్యలో ప్రవేశం పొందాలంటే స్థానికులై ఉండడం, రాష్ట్రం లో నీట్ రాయడంతో పాటు అంతకు ముందు, 9, 10, ఇంటర్ రెండేళ్లు కలిపి మొత్త నాలుగేళ్లు వరసగా తెలంగాణలో వారిని స్థానికులుగా గుర్తించాలని పేర్కొం టూ ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే స్థానికతపై జారీ చేసిన 33 లోని 3(ఏ) జీ వోపై 135 మంది విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు.తాము తెలంగాణ స్థానికులమేనని, కేవలం ఒకట్రెండేళ్లు ఇతర రాష్ట్రా ల్లో చదివినంత మాత్రాన ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు అనర్హులుగా ప్రకటించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు.
దీనిపై సుదీర్ఘ వాదనల తర్వాత ఈ నెల 5న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే నేత్వృంలోని జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం విద్యా ర్థులకు అనుకూలంగా తీర్పు చేప్పింది. ఒక విద్యార్థి తెలంగాణలో నివాసం లేదా శాశ్వ త నివాసి అని నిర్ధారించడానికి ప్రభుత్వ మార్గదర్శకాలను రూపొందించాలని ప్ర భుత్వానికి సూచిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే దీనిపై రాష్ట్రప్రభుత్వం ఈ నెల 11న సుప్రీంకోర్టులో సవాలు చేసింది.
విద్యార్థులకు అనుకూలంగా తీర్పు
ఈ నెల 20న ప్రధాన న్యాయమూర్తి జ స్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూ డిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టిం ది. తెలంగాణ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు విన్న ధర్మాసనం హైకోర్టు తీర్పుపై తాత్కాలిక స్టే ఇస్తూనే 135 మందిని కౌన్సిలింగ్‌కు అనుమతిస్తూ ఈ నెల 20న ఆ దేశాలిచ్చింది. దీంతో సీట్ల భర్తీ ప్రక్రియకు మార్గం సుగమం అయింది. అయితే వెం టనే కౌన్సిలింగ్ ప్రారంభించాలని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్ణయించింది.
దేశంలోని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల నీ ట్ పరీక్ష నిర్వహణ నిర్లక్ష్యానికి తోడు, వివాదాలు, కోర్టు కేసులు చుట్టుముట్టడం కార ణంగా అక్టోబర్ 1నుంచి ఎంబీబీఎస్ మొ దటి సంవత్సరం తరగతులు ప్రారంభం కావలసి ఉన్నా, రాష్ట్రంలో సీట్ల భర్తీ ప్రక్రియ ఇంకా మొదలు కాకపోవడంతో నీట్ అర్హత సాధించిన 47,356 మంది విద్యార్థుల భవిష్యత్తుపై ఆందోళన నెలకొంది.
సుప్రీంకోర్టు తీర్పు ప్రభుత్వానికి సానుకూలంగా వచ్చినందున ఈ ఏడాది ఎంబీబీఎస్ విద్యాసంవత్సరంపై ప్రభావం లేకుండా సత్వరమే ప్రవేశాలు నిర్వహించాలని అందరూ కోరుకుంటున్నారు.
వ్యాసకర్త సెల్: 9618254567