23-08-2025 01:13:38 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 22 (విజయక్రాంతి): సైబర్ మోసాలపై హైదరా బాద్ సర్కిల్‌లోని వివిధ ప్రాంతాల్లో ఎస్‌బీఐ అవగాహనా కార్యక్రమాలు చేపడుతుంది. వివిధ విద్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు, కార్యాలయాలు, మాళ్లు, మెట్రో స్టేషన్లు, పార్కులు వివిధ ప్రదేశాల్లో అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం, సన్ ఇంటర్నేషనల్ కాలేజీ, పీడీఎస్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, గులాం అహ్మద్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ తదితర విద్యాలయాల్లో విద్యార్థులకు సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు. నిందితులు సైబర్ మోసాలకు పాల్పడుతున్న తీరును పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. విద్యార్థులు అ త్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తమ కుటుంబ సభ్యులు, బంధువు లు, స్నేహితులను సైతం జాగురుకం చేయాలని సూచించారు. సైబర్ క్రైమ్ జరిగినట్టు అనుమాన మొస్తే హెల్ప్‌లైన్ నెంబర్ 1930లో సంప్రదించాలని పేర్కొన్నారు. ఆర్‌బీఐ ప్రతినిధులు ఇంటిగ్రేటెడ్ ఆర్‌బీఐ అం బుడ్స్‌మెన్ స్కీమ్ గురించి విద్యార్థులకు వివరించారు. ఫిర్యాదుల పరిష్కారానికి అందుబాటులో ఉన్న మార్గాలను తెలియజేశారు.
విద్యార్థులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎస్‌బీఐ జనరల్ మేనేజర్ రవికుమార్ శర్మ, ఆర్‌బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ అంబుడ్స్‌మెన్ (తెలంగాణ, ఏపీ), డాక్టర్ ఎస్ సుబ్బయ్య, ఆర్‌బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్, డిప్యూటీ అంబుడ్స్‌మెన్ (తెలంగాణ, ఏపీ) పీ కల్యాణ్ చక్రవరి, వీసీఐబ్ల్యూయూ ప్రిన్సిపల్ డాక్టర్ పావని, ఎస్‌బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్స్ బిపిన్ కుమార్ సింగ్, నవనీత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.