calender_icon.png 24 November, 2025 | 12:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరుకే నూతన ఊపిరి

24-11-2025 12:33:15 AM

  1. సిద్దిపేట డీసీసీ పదవితో మళ్లీ మంటలు

యువతకి పదవి ఇచ్చినా అసంతృప్తికి బ్రేక్ లేదనే గుసగుసలు

సిద్దిపేటలో మైనంపల్లి హనుమంతరావు హవా కొనసాగుతుందా?

సిద్దిపేట, నవంబర్ 23 (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా కాంగ్రెస్లో డిసిసి పదవి ప్రకట నా రాజకీయ వాతావరణానికి పెట్రోల్ జత చేసినట్లు అయ్యింది. ఇప్పటికే మూడు వర్గాలుగా చీలిపోయిన జిల్లా కాంగ్రెస్ మరింతగా అంతర్గత పోరాటంలోకి జారుకుపోయిందని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ము ఖ్యంగా గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, సిద్దిపేట డిసిసి మాజీ అధ్యక్షుడు తుమ్ముకుంట నర్సారెడ్డి కుటుంబానికి మళ్లీ పదవి వరించిన తీరు పాత గాయాలను మళ్లీ రేకెత్తించినట్లయ్యింది.

నర్సారెడ్డి స్వంత నియోజకవర్గం లోనే తీవ్ర వర్గపోరు నెలకొన్న సమయంలో ఆయన కుమార్తెకు డిసిసి బాధ్యతలు కేటాయించడం మీద పార్టీ సీనియర్లు మండిప డుతున్నారు. పార్టీకి నిబద్ధతతో పనిచేసిన నేతలను పక్కనబెట్టి ఫ్యామిలీ పాలిటిక్స్కే ప్రాధాన్యం ఇచ్చారా? అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మైనంపల్లి హవా కొనసాగుతుందా?

నర్సారెడ్డి కుటుంబానికి పదవి దక్కడంలో మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రభావం పనిచేసిం దనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి. పార్టీ అధిష్ఠానంలో ఉన్న గాడ్ ఫాదర్స్ ఆశీర్వాదంతోనే ఈ ‘రాజకీయ అద్భుతం’ జరిగిందనే విమర్శలు సీనియర్ నాయకుల గుండెల్లో మండుతున్నాయి. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, దుబ్బాక కాంగ్రెస్ నేత డాక్టర్ శ్రావణ్ కుమార్ రెడ్డి వంటి సీనియర్లను పట్టించుకోకుండా తీసుకున్న నిర్ణ యమిదే పార్టీలో అసమ్మతి జ్వాలలను రగిలిస్తోందనీ తెలుస్తుంది.

అయితే జిల్లాలో మైనంపల్లి హనుమంతరావు హవా కొనసాగుతుందా అనే ప్రశ్నలు వెలువెత్తుతున్నా యి. తనదైన శైలిలో సిద్దిపేటలో పాగా వేసిన మైనంపల్లి హనుమంతరావు డిసీసీ పదవిని తన వర్గానికి ఇప్పించుకోలేకపోయారని అ లాంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఆయన ప్రభావం సిద్దిపేటలో కొనసాగుతుందా లే దా అనే అంశం ప్రశ్నార్థకంగా మారిందని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

యువతకు పట్టం& కానీ ప్రశ్నలు వేలెత్తుతున్నాయి

డిసిసి పదవి యువతరానికి అప్పగించడం పార్టీ కార్యకర్తల్లో కొంత ఉత్సాహం నింపినప్పటికీ, సిద్దిపేట రణరంగాన్ని శాంతపరచే నాయకత్వ సామర్థ్యం కొత్త అధ్యక్షు రాలికి ఉందా? అన్న సందేహాలు విస్తరిస్తున్నాయి. పదవిని యువతలోని ప్రతిభను ప్రోత్సహించడానికి ఇచ్చారా? లేక నర్సారెడ్డి కుటుంబానికి మళ్లీ ప్రాధాన్యం ఇవ్వడానికి కేవలం ‘యువ నాయకత్వం’ అనే ఆవరణ ను ఉపయోగించారా? అనే చర్చ కూడా వేడెక్కుతోంది.

జిల్లాలోని అనేక మంది యువజ న నేతలు స్పష్టంగా చెబుతున్నారు. నర్సారెడ్డి జోక్యం లేకపోతే యువతకు నిజమైన న్యా యం జరిగేదనీ, కుటుంబ రాజకీయాలు కవ చం ధరించకుండా యువత తమదైన స్థానం పొందేదేనని.

గ్రూప్ పాలిటిక్స్కు తెరపడుతుందా? లేక మరింత పెరుగుతుందా?

డిసిసి పదవికి నర్సారెడ్డి వర్గం, మైనంపల్లి వర్గం, అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్, డాక్టర్ శ్రావణ్ కుమార్ రెడ్డి వర్గం మధ్య హోరాహోరీ పోటీ నడిచింది. చివరకు నర్సారెడ్డి వర్గానికే పదవి దక్కడంతో విభేదాలు మరింత దూకుడు సంతరించుకున్నాయి.

ఈ నిర్ణయం ఒకే వర్గానికి మేలు చేస్తుందనీ, జిల్లాలో కాంగ్రెస్ ఏకతాటిపైకి రావడం అసా ధ్యం అని సీనియర్లు ధ్వజమెత్తుతున్నారు.ఇక స్థానిక సంస్థల ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ అధిష్ఠానం తీసుకున్న ఈ నిర్ణయం పార్టీ ఓటు బ్యాంకుపైనే ప్రభావం చూపుతుందని, ఇది కాంగ్రెస్కు నష్టాన్ని తెచ్చే ప్రమాదం ఉందని అంచనాలు వినిపిస్తున్నాయి.

ఆంక్షారెడ్డి ముందున్న భారీ సవాలు

చిన్న వయసులోనే జిల్లాకాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన ఆంక్షారెడ్డి ఇప్పుడు అసలు పరీక్షను ఎదుర్కోనున్నారనీ రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.పార్టీని బలోపేతం చేయాలంటే మొదట గ్రూప్ రాజకీయాలకు తెర దించాలని, వర్గాలను కలిపే నాయకత్వం చూపకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాం గ్రెస్కు తీవ్ర ఇబ్బందులు తప్పవనీ విశ్లేషకులు సూచనలు చేస్తున్నారు.

యువ నాయ కత్వం వచ్చినందుకు స్వాగతం పలికినప్పటికీ, నాడి పట్టుకుని పనిచేయగల దక్షతను ఆంక్షారెడ్డి ప్రదర్శించాలనీ, విభేదాలను తొలగించి, కార్యకర్తలను ఒక్కటిగా చేసుకుని, గ్రౌండ్లో అలుపెరుగని పోరాటం చేస్తేనే జిల్లాలో కాంగ్రెస్ నిలదొక్కుకుంటుందని విశ్లేషకుల అభిప్రాయం.

చివరి మాట... 

సిద్దిపేట కాంగ్రెస్ ఇంతముందే పగుళ్ల మీద నడుస్తోంది. ఇప్పుడు డిసిసి పదవి కేటాయింపు ఆ పగుళ్లను మరింత విస్తరించింది. కొత్త అధ్యక్షురాలు తమదైన శైలిలో పార్టీని క్రమబద్ధీకరించి వర్గపోరుకు ముగిం పు పలుకుతారా?లేక సిద్దిపేట కాంగ్రెస్ మళ్లీ అంతర్గత మంటల్లోనే కాలిపోతుందా? అనేది ఆంక్షారెడ్డి నాయకత్వానికి పరీక్షగా మారింది.

ఆల్ ది బెస్ట్ ఆంక్షారెడ్డి!