24-11-2025 12:33:05 AM
48 గంటల్లో తుఫాన్‌గా బలపడే అవకాశం
హైదరాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి): బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతున్నది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ సోమవారం ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నదని వాతావరణ కేంద్ర పేర్కొన్నది.
అనంతరం 48 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫాన్‌గా మారే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంగళవారం వరకు నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక ప్రాంతాల్లో మరో అల్పపీడనం కూడా ఏర్పాడే అవకాశం ఉన్నదని వివరించింది.
మరోవైపు రానున్న రెండు రోజులు రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొన్నది. ఆదివారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్‌లో అత్యల్పంగా 11.6 డిగ్రీలు, ఆదిలాబాద్ భీమ్‌పూర్‌లో 12 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వివరించింది.