calender_icon.png 24 November, 2025 | 12:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి

24-11-2025 12:43:34 AM

 -భద్రాచలంలో కరపత్ర ఆవిష్కరణ

-సీపీఐ ఎంఎల్ మాసలైన్ పార్టీ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు కెచ్చేల రంగారెడ్డి 

 భద్రాచలం (విజయక్రాంతి); నవంబర్ 24న తేదీన కలెక్టరేట్ ఎదుట జరిగే ధర్నాను జయప్రదం చేయాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ రాష్ట్ర నాయకులు రంగారెడ్డి పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్న దాన్ని నిరసిస్తూ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించడానికి భద్రాచలంలో కర్రపత్రం ఆదివారం విడుదల చేశారు.

మీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు గ్యారంటీల హామీ తో పాటు అనేక వాగ్దానాలు చేసి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటి మూడో సంవత్సరంలో ప్రవేశిస్తున్న సందర్భంగా డిసెంబర్ 9న సంబరాలు జరుపుకోబోతున్నదనీ అన్నారు. సంబరాలు మారుమోగుతాయేమోగాని ప్రజల బతుకులు మాత్రం మారలేదు అని ఈ సందర్భంగా తెలిపారు.

ఇచ్చిన హామీలు పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఇందిరమ్మ ఇల్లు ఆడబిడ్డలకు 2500 రూపాయలు వద్ద పెన్షన్లు 4000 రూపాయలు పెంచటం వికలాంగులకు 3000 రూపాయల నుండి 6000 రూపాయలకు పెంచడం రైతు రుణాలు రద్దు ఆటో కార్మికులకు వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12,000 రూపాయల జీవన వృత్తి నిరుద్యోగులకు నెలకు 3000 రూపాయల నిరుద్యోగ భృతి పంటలకు బోనస్సు సకాలంలో చెల్లించటం వంటి హామీలు అమలు అమలు కాలేదనీ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది చాలా అన్యాయం అలాగే ఈ సంవత్సరం అతివరసాలు వల్ల పత్తి వరి మొక్కజొన్న తదితర పంటలు నష్టపోయిన ఈ సమయంలో రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోకపోగా పంటల బీమాను అమలు చేయలేదని పండిన కొద్దిపాటి పంటలను కొనుగోలు చేయుటకు నిబంధనల పేరుతో రైతులను ముప్పు తిప్పలు పెట్టడం దుర్మార్గంమనీ ఆయన అన్నారు.

ఇట్టి పరిస్థితుల్లో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ (ప్రజాపంధ )రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 24వ తేదీన కలెటరేట్లు ముందు ధర్నాలు ప్రదర్శనలు జరపమని పిలుపునిచ్చిందని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలని నిర్ణయించిందని ఆయన అన్నారు. ఈ పిలుపులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలు రైతాంగము అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని.

ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని కెచ్చల రంగారెడ్డి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకురాలు కచ్చల కల్పన డివిజన్ నాయకులు దాసరి సాయన్న మునిగల శివ ప్రశాంత్, మునిగిల మహేశ్వరి, భాస్కరు, కుమారి, శారద, శాంతక్క, రామ, పిరదోసు, షకీరా ,నసీమా, కృష్ణకుమారి, గౌతము తదితరులుపాల్గొన్నారు.