calender_icon.png 14 December, 2025 | 6:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త చట్టాలతో హక్కులకు పాతర!

13-12-2025 12:00:00 AM

ఆర్ అరవింద్ :

* కనీసం 100 మంది వర్కర్లు పనిచేస్తున్న సంస్థలో లే ఆఫ్ లేదా రిక్రూట్‌మెంట్ ప్రకటించాలంటే ఇకపై ప్రభుత్వ అనుమతి అవసరం. ఇప్పుడు ఆ సంఖ్యను 300 చేశారు. అదే విధంగా ప్రభుత్వం ప్రకటించే స్టాండింగ్ ఆర్డర్లు కనీసం 100 మంది వర్కర్లు ఉన్న సంస్థలకే వర్తిస్తాయి.

భారత స్వాతంత్య్రోద్యమంలో కార్మిక రంగానిది ముఖ్యపాత్ర. నిజానికి స్వాతంత్య్రానికి పూర్వమే కార్మికులు తమ డిమాండ్ల పరిష్కారం కో సం ఎన్నో పోరాటాలు చేశారు. భారత్‌లో 1926లో ఉమ్మడి కార్మిక సంఘం ఏర్పాటైంది. అప్పటినుంచి కార్మిక సంఘాలు ఐక్యతగా తమ పోరాటాన్ని కొనసాగిస్తూనే వస్తున్నాయి. ఇవాళ దేశంలో కార్మికుల స మస్యలపై వివిధ యూనియన్లు తమ పోరాటాలు కొనసాగిస్తున్నప్పటికీ కొత్తగా వచ్చిన లేబర్ కోడ్స్ కార్మికుల జీవితాలను అశనిపాతంలోకి నెట్టేస్తున్నాయి.

కొత్త చట్టాలతో కార్మికులు తమ హక్కులను కో ల్పోయే ప్రమాదముంది.  మన ముందు తరాల అనేక త్యాగాల ఫలితంగా సాధించుకున్న కార్మిక హక్కులను కాపాడేందుకు కార్మిక లోకం మరోసారి ఏకమై పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే  ఇటీ వల కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల స్థానంలో కార్మిక కోడ్‌లను తీసుకువచ్చింది. వీటి ద్వారా సర్వతోముఖాభివృద్ధి సాధిం చి దేశం ముందుకు వెడుతుందని ఊదరగొట్టే ప్రయత్నం చేస్తోంది.

కానీ అవి కార్మి కుల హక్కులను హననం చేసి యాజమాన్యాల దయాదాక్షిణ్యాలకు వారిని బలి చే స్తాయి. 100 సంవత్సరాలుగా కార్మికులకు రక్షణగా నిలిచిన చట్టాలను భూస్థాపితం చేసి, యాజమాన్యాలు తమ ఇష్టారీతిన కా ర్మికులను ఉపయోగించుకునేలా లేబర్ కోడ్‌లను తయారు చేయడం ఆక్షేపణీ యం. 29 కేంద్ర కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్‌లుగా సంక్షిప్తీకరించి వాటిని కార్మికుల సంక్షేమం కోసమే అని ప్రకటించడం ఆశ్చర్యం కలిగించింది.

అంతేకాదు కార్మికుల హక్కుల పట్ల నిర్లక్ష్యం, కార్మిక సంఘాల పట్ల లెక్కలేనితనం, పెట్టుబడిదారులకు దోపిడీ మార్గాలను సుగ మం చేయాలన్న దృఢ సంకల్పమే ఇందు లో ఎక్కువగా కనిపిస్తున్నది. కార్మిక సం ఘానికి ఇచ్చిన నిర్వచనంలో యాజమాన్యాలు, యాజమాన్యాలూ కలిసి ఏర్పడిన సమూహం కూడా కార్మిక సంఘంగా పరిగణించబడుతుందని చెప్పడం వెనుక అర్థ మేమిటో తెలియలేదు. అన్ని రకాల వివాదాంశాలపై తుది నిర్ణయం కేంద్ర ప్రభు త్వానిదే అని ప్రకటించారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల మధ్య ఏదైనా లేబర్ కోడ్‌ల అంశంలో వివాదం ఏర్పడితే కేంద్రానిదే తుదినిర్ణయం.

అస్పష్టంగా కొత్త కోడ్‌లు..

సమాన పనికి సమాన వేతనం అమలు పరచాలన్నప్పుడు, స్త్రీ, పురుషులకు అసంఘటిత రంగంలో సమాన వేతనం ఏర్పా టుచేసే ప్రక్రియ ఏమిటో ప్రస్తావించలేదు. పైగా ఒక నిర్దేశించిన పనికి ఎవరినైనా ని యమించుకున్నప్పుడు యజమాని నిర్ణయమే అంతిమం అని ఇండస్ట్రియల్ రిలే షన్స్ అనే కోడ్‌లో స్పష్టంగా పేర్కొంటూ, సదరు యజమాని నిర్ణయాన్ని కోర్టులో కూడా సవాలు చేయరాదన్న నిబంధన ఎందుకు ఉంచినట్లు? రాత్రి పగలు తేడా లేకుండా స్త్రీలను పనుల్లో నియమించుకోవడం, కావాల్సినన్ని గంటలు పనిచేయిం చుకోవడం వంటివన్నీ స్త్రీల ఉద్ధరణగా ఎ లా భావించగలం?అన్నిటికన్నా క్రూరమైన ప్రతిపాదన ‘ఫిక్స్‌డ్ టర్మ్ ఎంప్లాయిమెంట్’.

యాజమాన్యం చెల్లించే గ్రాట్యూ టీ పొందడానికి ఇప్పుడున్న ఐదు సంవత్సరాల అర్హత కాలాన్ని ఒక సంవత్సరానికి’ కుదించామని చెప్పేది. ఈ ఫిక్స్‌డ్ టర్మ్ ఎంప్లాయ్‌మెంట్ ప్రతిపాదన ద్వారా భవిష్యత్తులో ఏ ఒక్కరికీ 2 లేదా 3 సంవత్సరా లకు మించి అగ్నివీరుల్లా ఉపాధి ఉండదు! ఇంతటి క్రూరత్వాన్ని కప్పిపెట్టుకోవడానికి ఒక సంవత్సరం పనిచేసినా సరే గ్రాట్యూటీ పొందవచ్చు అనే మాయమాట చెబుతున్నారు.

గ్రాట్యూటీ పేమెంట్ అనేది ఉద్యో గి పొందే వేతనాన్ని, చేసిన సర్వీస్ కాలాన్ని బట్టి ఉంటుంది. అలాంటప్పుడు ఒక సంవత్సరం పనిచేసిన ఉద్యోగి పొందే బేసిక్ ఎం త, దానికి సరిపడా ఒక సంవత్సరానికి ల భించే గ్రాట్యూటీ ఎంత? నామమాత్రం! ని యామక పత్రాలు పొందిన సంఘటిత రంగంలోని కొందరికి మాత్రమే గ్రాట్యుటీ చెల్లిస్తారు. 97శాతం అసంఘటితరంగ కా ర్మికులకు గ్రాట్యుటీ చెల్లించాలంటే ఏం చేయాలో ఈ కోడ్‌లలో పేర్కొనలేదు.

శ్రమ దోపిడీ..

ఈ మధ్యకాలంలో ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి, ఎల్ అండ్ టీ చైర్మన్ సుబ్రహ్మణ్యం లాంటి వ్యక్తులు వారానికి 70 నుంచి 90 గంటల పనిదినం ఉండేలా కార్మిక చట్టాల్లో మార్పులు చేయాలని పేర్కొంటున్నారు. తమ వ్యాపార సౌల భ్యం కోసం కార్మికుల నుంచి శ్రమ దోపిడీ చేయడం సమంజసం కాదు. ఇలాంటి కీలక చట్టాలపై పార్లమెంటులో కనీస చర్చ లేకుండా ఆమోదించడం విస్మయం కలిగించింది. కనీసం కొత్త లేబర్ కోడ్స్ విషయమై కేంద్రం.. కార్మిక సంఘాలతో చర్చ లు జరిపినా బాగుండేది.

కార్మిక చట్టాల పరిధి పెంచడం వల్ల దేశంలోని 70 శాతం సంస్థల్లోని కార్మికులకు రక్షణ అన్నది లే కుండా పోయింది. కొత్త లేబర్ కోడ్ ప్రకా రం కార్మికులకు 12 గంటల షిఫ్ట్‌లను అనుమతిస్తూ.. మరోవైపు 8 గంటల పనికి ఎనిమిది గంటలు విశ్రాంతి ఉండాలన్న నిబంధనను కాలరాయడమే అవుతుందని పార్లమెంట్‌లో సీపీఎం ఎంపీ జాన్ బిట్రాస్ ఆవేదన వ్యక్తం చేశా రు. అంతేకాదు కొత్త కార్మిక చట్టాల వల్ల  కార్మిక సంఘాల పరిధి నామమాత్రమై పోతుంది.

కార్మిక సంఘాన్ని రిజిస్టర్ చేసుకోవాలంటే కనీసం 10శాతం సభ్యులు గానీ లేదా వందమంది గానీ ఉంటే తప్ప సాధ్యపడదు. వంద మందికి మించి వర్కర్లున్న చోట వర్కర్స్ కమిటీ ఏర్పడనున్నది. ఈ వర్కర్స్ కమిటీలో యాజమాన్యం, కా ర్మిక సంఘాల ప్రతినిధులు సమాన సం ఖ్యలో ఉంటారు. 20 మంది కన్నా ఎక్కువ కార్మికులు ఉన్న చోట ‘గ్రీవెన్స్ రెడ్రెసల్ కమిటీ’ ఏర్పాటు చేస్తారు. చైర్మన్ మాత్రం యజమాన్యం వైపు నుంచే ఉంటారు. దీన్ని బట్టి ఎవరి ప్రయోజనాల కోసం కార్మిక చట్టాల సవరణ జరిగింది? సమ్మెలను నివారించడమే లక్ష్యంగా ఈ కోడ్‌లు తయారయ్యాయి.

పునరాలోచన అవసరం..

కనీసం 100 మంది వర్కర్లు పనిచేస్తు న్న సంస్థలో లే ఆఫ్ లేదా రిక్రూట్‌మెంట్ ప్రకటించాలంటే ఇకపై ప్రభుత్వ అనుమతి అవసరం. ఇప్పుడు ఆ సంఖ్యను 300 చేశారు. అదే విధంగా ప్రభుత్వం ప్రకటించే స్టాండింగ్ ఆర్డర్లు కూడా కనీసం 100 మంది వర్కర్లు ఉన్న సంస్థలకే వర్తిస్తాయి, ప్రస్తుతం దీనిని 300కి పెంచారు. మరి దీని ద్వారా యాజమాన్యాలకు లాభమా, వర్కర్లకు లాభమా? ఎవరైనా యజమాని నిర్దేశిత పనికోసం ఎవరినైనా నియామక పత్రం ఇచ్చి మరీ నియమించుకున్నప్పుడు వారిని తొలగించేటప్పుడు ఎలాంటి వివర ణ ఇవ్వాల్సిన అవసరం లేదు.

గిగ్ వర్కర్లు, ప్లాట్‌ఫాం వర్కర్లకు కూడా పర్మనెంట్ ఉద్యోగుల మాదిరిగా అన్నీ సమకూరుతాయని ప్రకటించారు. కానీ గిగ్ వర్కర్లు, ప్లా ట్‌ఫాం వర్కర్లకు సంబంధించిన యజమాని అనే అంశంపై స్పష్టత లేదు. లక్షలాది మందికి అర్థవంతమైన సామాజిక భద్రత లేకుండా పోతుంది. ఈ మా ర్పులు సమానత్వం, స్వేచ్ఛ వంటి రాజ్యాం గ హామీలను దెబ్బతీసే అవకాశముంది. చివరగా కొత్త కార్మిక చట్టాలతో కార్మికులు తమ హక్కులకై సమ్మెలు చేయడం ఇకపై కుదరకపోవచ్చు. పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం పబ్లిక్ మాటలిటీ సర్వీసు లో మాత్రమే సమ్మె ప్రారంభానికి 15 రో జుల ముందు నోటీసులు ఇవ్వాల్సి ఉం టుంది.

కేంద్రం ప్రవేశపెట్టిన నూతన కా ర్మిక చట్టాలపై కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు వ్యతిరేకంగా ఉన్నాయి. అంతేకాదు తమ రాష్ట్రాల్లో ఈ కొత్త చట్టాలను అమలు చేయాలనుకోవడం లేదని స్పష్టంగా పేర్కొన్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా కొత్త లేబర్ కోడ్స్‌పై పునరాలోచన చేయాల్సిన అవసరముంది. ఇక్కడి కార్మిక నాయకులతో చర్చించి కొత్త లేబర్ కోడ్‌లు అమలు చేయకుండా చూడాల్సిన అవసరముంది.