calender_icon.png 2 December, 2025 | 1:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త పంచాయతీ ఎన్నిక ఏకగ్రీవం

02-12-2025 12:49:15 AM

-మహబూబాబాద్ జిల్లా చంద్రతండా తొలి సర్పంచ్‌గా శ్రీను

మహబూబాబాద్, డిసెంబర్ 1 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని వెంకటగిరి గ్రామం నుంచి విడిపోయి ఇటీవల నూతనంగా ఏర్పడ్డ చంద్రు తండా గ్రామపం చాయతీ సర్పంచ్, 8 వార్డు సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం కానుంది.

సర్పం చు పదవితో పాటు 8 వార్డు సభ్యుల పదవులకు ఒక్కొక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఈ నెల 3న అధికారులు ఏకగ్రీవ ఎన్నిక ఫలితాన్ని లాంఛనంగా ప్రకటించడం తరువాయిగా మారింది. సర్పంచ్ పదవికి బానోతు శ్రీను, వా ర్డు సభ్యుల పదవులకు ఇస్లావత్ శోభ, లకావత్ రమేష్, బానోతు లలిత, లకావత్ శ్రీను, గుగులోతు బాలు, భూక్యా రాజు, బానోతు రజిత, గుగులోత్ సరిత ఒక్కొక్కరు నామినేషన్ దాఖలు చేశారు. పోటీ లేకపోవడంతో వీరి ఎన్నికను ఏకగ్రీవంగా ప్రకటిం చనున్నారు.