02-12-2025 12:50:45 AM
ఎంజీయూ వీసీకి ఫిర్యాదు చేసిన విద్యార్థులు
నల్గొండ రూరల్, డిసెంబర్ 1: మహాత్మా గాంధీ యూనివర్సిటీలో టాస్క్ శిక్షణ పేరిట విద్యార్థుల నుండి ఇంజనీరింగ్ కళాశాల కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ దుర్గాప్రసాద్ వసూళ్ల దండకు పాల్పడ్డారని విద్యార్థులు విసి కాజా అల్తాఫ్ హుస్సేన్ కు సోమవారం ఫిర్యాదు చేశారు. టాస్క్ శిక్షణకు డబ్బులు చెల్లించాలని ఇంజనీరింగ్ సెకండియర్ విద్యార్థుల నుండి 700 తృతీయ సంవత్సరం విద్యార్థుల నుండి 400 ఫైనల్ ఇయర్విద్యార్థుల నుండి 400 చొప్పున పూర్వ విద్యార్థుల నుండి డబ్బులు వసూలు చేశారు.
మొత్తంగా విద్యార్థుల నుండి 4 లక్షల 24 వేలు వసూలు చేసినట్టు విద్యార్థులు పిర్యాదు చేశారు బోధన సిబ్బంది నుండి 20 లక్షల డబ్బులు వసూలు చేసినట్టు యూనివర్సిటీలో చర్చించుకుంటున్నారు గత నెల రోజులుగా యూనివర్సిటీ విధులకు కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ హాజరు కాకపోవడం మరింత అనుమానాలకు బలం చేకూర్చింది ఈ విషయమై యూనివర్సిటీ కీలక అధికారులు కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ దుర్గాప్రసాద్ తల్లిదండ్రులను పిలిచి మాట్లాడిన విషయం హాట్ టాపిక్ గా మారింది వసూలు చేసిన డబ్బులు ఆన్లైన్ ట్రేడింగ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోయినట్టు చర్చించుకుంటున్నారు ఈ విషయమై ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ని ఫోన్ లో వివరణ కోరెందుకు ప్రయత్నించగా ఆమె స్పందించలేదు