15-05-2025 07:40:04 PM
అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్నాడనే నేపంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు..
భార్యతో పాటు ప్రియుడిని అరెస్ట్ చేసిన జిల్లా పోలీస్..
మునుగోడు/గట్టుపల్ (విజయక్రాంతి): అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్నాడనే నేపంతో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన వారిని నల్గొండ జిల్లా పోలీసులు(Nalgonda District Police) అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. గట్టుప్పల్ పోలీస్ స్టేషన్(Gattuppal Police Station) లో విలేఖరుల సమక్షంలో కేసు వివరాలను డీఎస్పీ శివరాం రెడ్డి గురువారం వెల్లడించారు. ఏ-1 రేవెల్లి నవీన్, ఏ-2 వల్లపు హేమలతగా గుర్తించి పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల వద్ద నుండి రెండు మొబైల్ ఫోన్లు, ఒక మోటార్ సైకిల్, హత్య సమయంలో ఉపయోగించిన, రక్త మచ్చలతో ఉన్న ఆకుపచ్చ, తెలుపు రంగుల టవల్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఈ కేసులో నిందితులు ఏ-1 రేవెల్లి నవీన్, ఏ-2 హేమలతతో గత మూడు సంవత్సరాలుగా అక్రమ సంబంధం కొనసాగించడంతో హేమలత తన భర్త మల్లేష్‌తో సహకరించడం మానేసింది. ఈ విషయంపై మల్లేష్ ఆమెను ప్రశ్నించి, ఆమెపై నిఘా పెట్టాడు. ఇది సహించలేని A-1, A-2, కలిసి మృతున్నీ అడ్డులేకుండా చంపాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తేదీ 10-05-2025 మధ్యాహ్నం సమయంలో A-1 మృతుడి ఇంట్లో టైల్స్ పెట్టడానికి వచ్చి పథకం ప్రకారమే మృతుడు, ఏ-1 లు కలిసి గ్రామంలో మద్యం సేవించి తమ ఇంటికి వెళ్లారు. మళ్ళీ సాయంత్రం సమయంలో ఏ-1 నవీన్, మృతుడు మల్లేష్‌ను పిలిచి మద్యం తాగించి, అతనిని పూర్తిగా స్పృహలేని స్థితికి తీసుకొచ్చాడు.
ఈ విషయాన్ని మృతుని భార్య ప్రియునికి ఫోన్లో తెలపగా ఏ-1 మల్లేష్‌ను బైక్‌పై ఇంటికి తీసుకెళ్లి, అక్కడే పక్కన ఉండి రాత్రి సుమారు 10:30 గంటలకు మృతుడి ఇంటికి వెళ్లి అక్కడ మృతుడు మంచంపై నిద్రలో ఉండగా, ఇదే అవకాశంగా బావించి నిందితులు వల్లపు మల్లేష్‌ను హత్య చేయాలనే నిర్ణయంతో అక్కడ ఉన్న టవల్ను తీసుకొని మృతుడి నోరు, ముక్కుపై గట్టిగా పెట్టి శ్వాస తీసుకోకుండా చేయగా, మల్లేష్ మేలుకోవడానికి ప్రయత్నించి ఏ-1ని కుడి బొటనవేలిని కొరికాడు. వెంటనే మృతుని భార్య అతని కాళ్లను బలవంతంగా పట్టుకోగా ఏ-1 అతని ఛాతీ మీద కుడి మోకాలి పెట్టి, కుడిచేతితో గొంతు గట్టిగా నలిపి, సుమారు 5 నిమిషాల పాటు శ్వాస ఆడకుండా చేసి చంపేశారని తెలిపారు.
తేదీ 11న, మృతుని తల్లి వల్లపు వెంకటమ్మ ఫిర్యాదు మేరకు మునుగోడు, గట్టుపల్ పోలీస్ స్టేషన్లో నుండి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ మర్డర్ కేసును నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి పర్యవేక్షణలో సీఐ చండూర్ ఆది రెడ్డి, ఎస్ఐ గట్టుప్పల్ వెంకట్ రెడ్డి, ఏఎస్ఐ ఆర్. అంజయ్య సిబ్బంది వి. రమేశ్ సుదర్శన్ లను వేగంగా దర్యాప్తు చేసి పట్టుబడి చేసినందుకు గాను జిల్లా ఎస్పీ అభినందించారు.