02-01-2026 01:14:36 AM
ముకరంపుర, జనవరి 1 (విజయ క్రాంతి): టి.ఎన్.జీవోల భవనంలో గురువా రం నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఉద్యోగులందరూ కలిసి కేక్ కట్ చే శారు. అనంతరం ఉద్యోగ సంఘాల నాయకులు మున్సిపల్ కమిషనర్ ప్రపల్ దేశాయ్, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకిడే, ఆర్డీఓ మహేష్, ఏవో గడ్డం సుధాకర్ లను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్, టీఎన్జీవోల జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి, సంగం లక్ష్మణరావు, ముప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి, రాగి శ్రీనివాస్, గూడ ప్రభాకర్ రెడ్డి, సర్దార్ హరేమేందర్ సింగ్, గంగారపు రమేష్, ఒంటెల రవీందర్ రెడ్డి, నల్ల వెంకటరెడ్డి, విజయ్ రాజేష్, భరద్వాజ్, వాస్తవి గౌడ్, శ్రీమాన్ రెడ్డి, ఇర్రుమల్ల శారద, సబిత, సునీత, హరిప్రియ, శైలజ, స్వర్ణలత, సుస్మిత, మన్మిట్, రాజేశ్వరరావు, అక్బర్, అస్గర్, శంషాద్దీన్, తదితరులు పాల్గొన్నారు.